IPL 2023: వాహనదారులకు అలెర్ట్.. రేపే బెంగళూరు, లక్నో మ్యాచ్.. అక్కడ ట్రాఫిక్ రూట్స్‌లో మార్పులు..

|

Apr 09, 2023 | 10:52 PM

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రేపు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో హోమ్ టీమ్‌ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఆర్‌సీబీ అభిమానులే కాక కోహ్లీ అభిమానులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ఉండడంతో మ్యాచ్‌ చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగానే..

IPL 2023: వాహనదారులకు అలెర్ట్.. రేపే బెంగళూరు, లక్నో మ్యాచ్.. అక్కడ ట్రాఫిక్ రూట్స్‌లో మార్పులు..
Bangalore Rcb Vs Lsg
Follow us on

బెంగళూరు: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రేపు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో హోమ్ టీమ్‌ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఆర్‌సీబీ అభిమానులే కాక కోహ్లీ అభిమానులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ఉండడంతో మ్యాచ్‌ చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగానే బెంగళూరు నగరంలో వాహనదారులు సాఫీగా వెళ్లేందుకు నగర ట్రాఫిక్ పోలీసు విభాగం ట్రాఫిక్ రూట్‌ను మార్చింది. మ్యాచ్ జరిగే సమయానికి అంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రూట్ మార్పు ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా అన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను అనుమతిస్తారు.

ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..

ఆర్‌సీబీ, లక్నో మ్యాచ్ నేపథ్యంలో MG రోడ్, క్వీన్స్ రోడ్, MG రోడ్ నుంచి కబ్బన్ రోడ్, రాజ్ భవన్ రోడ్, సెంట్రల్ స్ట్రీట్ రోడ్, కబ్బన్ రోడ్, సెయింట్ మార్క్స్ రోడ్, మ్యూజియం రోడ్, కస్తూరా బా రోడ్, అంబేద్కర్ వీడి రోడ్, ట్రినిటీ సర్కిల్, లావెల్లే రోడ్, విఠల్ మాల్యా రోడ్, నృత్తుంగ రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు పోలీసు శాఖ తెలిపింది. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఈ రోడ్లను ఉపయోగించరాదని, ఇతర మార్గాల్లో ప్రయాణించాలని కోరింది.

పార్కింగ్ ఏర్పాట్లు: కింగ్స్ రోడ్, బిఆర్‌బి మైదాన్, కంఠీరవ స్టేడియం, యుబి సిటీ పార్కింగ్ లాట్ శివాజీనగర్ బిఎంటిసి బస్టాండ్ మొదటి అంతస్తు, పాత కెజిడి భవనం సమీపంలో పార్కింగ్ సౌకర్యాలు కల్పించినట్లు పోలీసు శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఐపీఎల్ 16వ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి శుభారంభం చేసిన ఆర్సీబీ జట్టు.. రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో తర్వాత, RCB కొంతమంది ఆటగాళ్లను తొలగించి, వారి స్థానంలో ఇతర ఆటగాళ్లను రంగంలోకి దించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నోతో జరిగే మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.

మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..