IPL 2022: రెండు మ్యాచ్‌ల్లో 13 పరుగులు చేసిన 8.25 కోట్ల ఆటగాడు.. ఇలా అయితే కష్టమే అంటున్న ప్రేక్షకులు..!

|

Apr 05, 2022 | 6:11 PM

IPL 2022: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. జట్టు మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమవుతుంది. కీరన్ పొలార్డ్‌తో పాటు టిమ్ డేవిడ్

IPL 2022: రెండు మ్యాచ్‌ల్లో 13 పరుగులు చేసిన 8.25 కోట్ల ఆటగాడు.. ఇలా అయితే కష్టమే అంటున్న ప్రేక్షకులు..!
Tim David
Follow us on

IPL 2022: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. జట్టు మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమవుతుంది. కీరన్ పొలార్డ్‌తో పాటు టిమ్ డేవిడ్ వంటి డేంజర్ బ్యాట్స్‌మెన్ ఉన్నా రాణించలేకపోతుంది. ముఖ్యంగా టిమ్ డేవిడ్ గురించి చెప్పాలంటే.. ఈ ఆటగాడిని ముంబై ఇండియన్స్ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మొదటి రెండు మ్యాచ్‌లలో 13 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్న టిమ్‌ వచ్చే మ్యాచ్‌ల్లో తన ఆటని మెరుగపరుచుకుంటానని చెబుతున్నాడు. ఇందుకోసం వెటరన్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ దగ్గర మెలకువలు నేర్చుకుంటా అంటున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ మాట్లాడుతూ.. ‘పొలార్డ్ 10 సంవత్సరాలకు పైగా ఐపిఎల్‌లో ఆడుతున్నాడు. కాబట్టి అతను చాలా అనుభవజ్ఞుడు. అయితే ఎవ్వరూ కూడా ఒకేసారి ప్రతిదీ సాధించలేరు. అందుకే పొలార్డ్‌ నుంచి విభిన్న పరిస్థితులను, అనుభవాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పాడు. వాస్తవానికి ఈ సింగపూర్ ఆటగాడు పొలార్డ్ లాగే మంచి ఆల్ రౌండర్. భారీ షాట్లు ఆడడంలో నిష్ణాతుడు. ముంబై రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చినప్పటికీ జట్టు ముందుకెళితే బాగా రాణిస్తుందని డేవిడ్ చెబుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘అతను ఒక సరదా కెప్టెన్. అతనితో ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. ఇప్పుడిప్పుడే జట్టులోని ఇతర ఆటగాళ్లతో అడ్జస్ట్ అవుతున్నాను. మేము ఊపందుకోవడం ప్రారంభించాం. కలిసి కట్టుగా రాణిస్తాం’ అని చెప్పాడు.

టిమ్ డేవిడ్ కుడిచేతి బ్యాట్స్‌మెన్. టీ20 క్రికెట్‌లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. డేవిడ్ 91 టీ20 మ్యాచ్‌ల్లో 32కి పైగా సగటుతో 1978 పరుగులు చేశాడు. డేవిడ్ స్ట్రైక్ రేట్ 159. అతని బ్యాట్ నంఉచి 116 సిక్సర్లు, 142 ఫోర్లు జాలువారాయి. టిమ్ డేవిడ్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో 46.50 సగటుతో 558 పరుగులు చేశాడు. ఈ కుడిచేతి బ్యాట్స్‌మన్ బిగ్ బాష్ లీగ్, పిఎస్ఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్‌లో అన్ని చోట్లా తనని తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో భారీ ఇన్నింగ్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే జరిగితే ముంబై గెలుపుబాట పట్టినట్టే.

Viral Photos: ప్రపంచంలో రెండు ముఖాలున్న వింతైన వ్యక్తి ఇతడే.. ఇతడి స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Video: గుడ్డు నుంచి బయటికొచ్చిన డైనోసర్ పిల్ల.. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Ramzan 2022: రంజాన్ స్పెషల్..ఖర్జూరం బర్ఫీ ఎలా తయారుచేస్తారో తెలుసా..?