IPL 2022 Purple Cap: నాలుగో స్థానంలోకి దూసుకొచ్చిన ఆర్సీబీ బౌలర్‌.. యుజ్వేంద్ర చాహల్‌కి గట్టి పోటీ..!

IPL 2022 Purple Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో చాలా మంది యువ ఆటగాళ్లు తమదైన శైలిలో రాణిస్తున్నారు. ఈ ఆటగాళ్లలో

IPL 2022 Purple Cap: నాలుగో స్థానంలోకి దూసుకొచ్చిన ఆర్సీబీ బౌలర్‌.. యుజ్వేంద్ర చాహల్‌కి గట్టి పోటీ..!
Ipl 2022 Purple Cap
Follow us

|

Updated on: May 18, 2022 | 12:42 PM

IPL 2022 Purple Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో చాలా మంది యువ ఆటగాళ్లు తమదైన శైలిలో రాణిస్తున్నారు. ఈ ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకరు. ఇతడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌కు ముప్పుగా మారుతున్నాడు. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మూడు వికెట్లు తీశాడు. మూడు ఓవర్లు వేసి కేవలం 23 పరుగులకే ముగ్గురు ముంబై బ్యాట్స్‌మెన్‌లకు పెవిలియన్ పంపించాడు.

ఉమ్రాన్ నంబర్-4కు చేరుకున్నాడు ముంబైపై బెస్ట్‌ ప్రదర్శన కారణంగా ఉమ్రాన్ పర్పుల్ క్యాప్ రేసులో నంబర్-4 ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడగా 21 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ జట్టు ఇంకా ప్లేఆఫ్‌కు చేరుకోలేదు. అది చేరితే ఖచ్చితంగా ఈ బౌలర్ మరిన్ని వికెట్లు తీయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు పర్పుల్ క్యాప్ గెలిచే సత్తా కూడా ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పటికీ నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు.

అయితే చాహల్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన వనిందు హసరంగా నుంచి అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాడు. చాహల్ కంటే హసరంగ కేవలం ఒక వికెట్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్ కగిసో రబడ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రబడ 12 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ ఐదో స్థానంలో ఉన్నాడు. కుల్దీప్ 13 మ్యాచ్ ల్లో 21 వికెట్లు పడగొట్టగా.. రాజస్థాన్, బెంగళూరు ప్లేఆఫ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో చాహల్, హసరంగా పర్పుల్ క్యాప్ కోసం పెద్ద పోటీదారులుగా కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..