IPL Auction 2022: ఆస్ట్రేలియన్(Australia) ఓపెనర్ బెన్ మెక్‌డెర్మాట్, వెస్టిండీస్(West Indies) ఆల్-రౌండర్ రొమారియో షెపర్డ్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. ఈ ఫాంతోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) కాంట్రాక్టులను మొదటిసారిగా గెలుచుకుంటారని అంతా భావిస్తున్నారు. గత సీజన్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కూడా దక్కించుకునేందుకు ఆసక్తి చూపలేదు.
బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో మెక్‌డెర్మాట్ అద్భుతంగా రాణించి, సోమవారం ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం అతను ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ 27 ఏళ్ల ఆటగాడు బీబీఎల్ 2022 సీజన్‌లో అత్యధికంగా 577 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 153.86గా ఉంది. ఆస్ట్రేలియా తరపున 17 టీ20 ఇంటర్నేషనల్‌లు, రెండు వన్డులు ఆడాడు. గత సంవత్సరం, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ద్వయం రిలే మెరెడిత్ (రూ. 8 కోట్లు), ఝే రిచర్డ్‌సన్ (రూ. 14 కోట్లు) BBL సీజన్ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో భారీ మొత్తంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆదివారం బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి ఓవర్‌లో షెపర్డ్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. అతను 28 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పటికీ, అతని జట్టు ఒక పరుగు తేడాతో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ 27 ఏళ్ల ఆల్ రౌండర్ తన ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే ఐపీఎల్ వేలం జాబితాలో రూ. 75 లక్షల లిస్టులో షెపర్డ్ పేరు నిలిచింది.
ఈ భారీ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్న వెస్టిండీస్‌కు చెందిన 41 మంది ఆటగాళ్లలో షెపర్డ్ ఒకరు. ఈసారి ఐపీఎల్‌లో 10 జట్లు ఉన్నాయి. వీటి కోసం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో భారీ వేలం నిర్వహించనున్నారు.
Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలంలో రూ.20కోట్లు దాటనున్న బిడ్డింగ్.. ఆ లిస్టులో ఎవరున్నారంటే?