IPL 2022 Mega Auction: ఆరేళ్ల తరువాత రీఎంట్రీ.. ఐపీఎల్ 2022లో సత్తా చాటేందుకు సిద్ధమైన ప్లేయర్..!
IPL 2022: దాదాపు 6 సంవత్సరాలుగా ఐపీఎల్ లీగ్‌కు దూరంగా ఉన్న బౌలర్ కూడా తిరిగి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతను తన చివరి మ్యాచ్‌ని 2015 సంవత్సరంలో ఆడాడు. ఆయనెవరో కాదు..
IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 (IPL 2022) చాలా విభిన్నంగా ఉండబోతుంది. మెగా వేలం ద్వారా ప్లేయర్లను ఎన్నుకోవడం దగ్గర నుంచి, రెండు కొత్త జట్లు కూడా లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వరకు అంతా మారిపోయింది. అలాగే కొత్త టైటిల్ స్పాన్సర్(TATA IPL) కూడా రావడంతో ఈ ఏడాది సరికొత్త జోష్‌తో క్రికెట్ ప్రేమికుల ముందుకు రాబోతుంది. అయితే దాదాపు 6 సంవత్సరాలుగా ఐపీఎల్ లీగ్‌కు దూరంగా ఉన్న బౌలర్ కూడా తిరిగి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతను తన చివరి మ్యాచ్‌ని 2015 సంవత్సరంలో ఆడాడు. ఆయనెవరో కాదు ఆస్ట్రేలియా (Australia) పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc). రాబోయే ఐపిఎల్ సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
జనవరి 12న మీడియాతో మాట్లాడిన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడేందుకు రంగం చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో పాపులారిటీ సంపాదించాలనే ఉద్దేశ్యంతో, రాబోయే టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన సన్నాహాల్లో పాల్గొనే ఉద్దేశ్యంతో తాను ఐపీఎల్ 2022లో పాల్గొనవచ్చని అంగీకరించాడు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజులు సమయం తీసుకుంటానని వెల్లడించాడు.
స్టార్క్ IPL 2022 బరిలోకి.. ఎడమచేతి వాటం ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ, “ఈ విషయం పరిశీలనలో ఉంది. నేను ఐపీఎల్‌లో 6 ఏళ్లుగా భాగం కావడం లేదు. కానీ, రాబోయే T20 ప్రపంచకప్‌కు సన్నాహకాల కోసం, IPL 2022లో పాల్గొనడం మంచి ఎంపిక అని నేను భావిస్తున్నాను. అందుకే ఇందులో ఆడాలని ఆలోచిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. 31 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ 2015లో ఆడాడు. 2018 వేలంలో, కోల్‌కతా రూ. 9.40 మిలియన్లకు దక్కించుకుంది. అయితే అతను కాలు గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలగవలసి వచ్చింది.
ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్ ప్రదర్శన.. మిచెల్ స్టార్క్ IPLలో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 7.17 ఎకానమీ, 17.06 స్ట్రైక్‌తో 34 వికెట్లు తీశాడు. లీగ్‌లో స్టార్క్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడితే, 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో, అతను బ్యాట్‌తో జట్టు కోసం 96 పరుగులు చేశాడు. ఇందులో 29 పరుగులు అతని అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. స్టార్క్ ఆస్ట్రేలియా తరపున 48 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 7.52 ఎకానమీ, 18.1 స్ట్రైక్ రేట్‌తో 60 వికెట్లు పడగొట్టాడు.
Australian pacer, Mitchell Starc is our first addition to the #KnightsOf2018 squad at VIVO #IPLAuction! ?
We are glad to have you in #KKR family, @mstarc56! #KnightsOf2018 #KorboLorboJeetbo pic.twitter.com/2vBIvLsHJ4
— KolkataKnightRiders (@KKRiders) January 27, 2018
IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీలు, వేదిక వివరాలివే..