IPL 2022: ఆటల వల్ల భవిష్యత్ ఉండదని, చదువుకుంటే ఉద్యోగం చేయొచ్చని చిన్నప్పటి నుంచి అందరు చెబుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు చదివేవారు కాదు ఆడేవారు హీరోలవుతున్నారు. దీనికి సరైన ఉదాహరణ కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూసింగ్ అని చెప్పవచ్చు. ఐపీఎల్‌లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమిని ఆపింది ఇతడే. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తన టాలెంట్‌తో అందరి దృష్టిన ఆకర్షించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. క్రికెట్‌లో హీరో అయిన రింకూసింగ్ చదివింది మాత్రం తొమ్మిదో తరగతే. కానీ కోల్‌కతా విజయంలో ప్రధాన పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
IPLతో రింకూ సింగ్ అనుబంధం మొదటగా 2017 సంవత్సరంలో ఏర్పడింది. పంజాబ్ కింగ్స్ జట్టు అతనిని అప్పటి బేస్ ధర రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. మరుసటి సంవత్సరం అంటే 2018 వేలంలో అతను పంజాబ్ నుంచి కోల్‌కతాకు మారాడు. బేస్ ప్రైస్ రూ.20 లక్షలు అయితే కోల్ కతా పూర్తి రూ.80 లక్షలు చెల్లించింది. కానీ IPL 2022కి ముందు అతను KKR ఫ్రాంచైజీ కోసం 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. IPL 2022 మెగా వేలంలో రింకు సింగ్ పేరు మరోసారి వినిపించింది. ఈసారి కూడా అతన్ని 55 లక్షల రూపాయలకు KKR కొనుగోలు చేసింది. గత వేలం కంటే ఖచ్ఛితంగా ధర తక్కువగానే ఉంది. అయితే ఈసారి రింకూ సింగ్‌కు ఆడే అవకాశాలు ఎక్కువగా రావడం విశేషం. IPL 2022లో రింకు సింగ్ KKR కోసం ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 50 సగటుతో 150 స్ట్రైక్ రేట్‌తో 100 పరుగులు చేశాడు. ఈ 3 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి హీరోగా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్‌పై 23 బంతుల్లో 42 పరుగులతో రింకు సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఇతడి ఆటతీరు చూసిన సీనియర్లందరు ప్రశంసిస్తు్న్నారు. సురేష్ రైనా మాట్లాడుతూ.. ‘రింకూ సింగ్ కృషి ఇప్పుడు ఫలిస్తోందన్నాడు. నా సోదరుడు KKR కోసం గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్తరప్రదేశ్ పేరును ఇలాగే టాప్‌లో ఉంచాలని కోరాడు’ 24 ఏళ్ల రింకూ సింగ్ జీవిత పోరాటాన్ని చూశాడు. వాళ్ల తండ్రి ఇంటింటికి సిలిండర్లు డెలివరీ చేసేవాడు. అన్నయ్య ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఇప్పుడు రింకూ ఐపీఎల్‌లో విజయవంతం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
रिंकू सिंह- घरेलू क्रिकेट की सारी मेहनत अब रंग ला रही है। केकेआर के लिए खेली गई बेहद कीमती पारी। अच्छा किया मेरे भाई।ऐसे ही अच्छा करते रहो और उत्तर प्रदेश का नाम ऊँचा करते रहो।@rinkusingh235 @KKRiders @DrDJgupta
— Suresh Raina?? (@ImRaina) April 28, 2022
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి