IPL 2022: గత సీజన్‌లో ఫ్లాప్.. టీమిండియాలోనూ విఫలం.. ఐపీఎల్‌లో సారథిగా సరికొత్త పాత్రతో సిద్ధమైన ఆల్‌రౌండర్?
Hardik Pandya: ఈసారి ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొననున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీలో కొత్త జట్టులో సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
IPL 2022, Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ కోసం అన్ని జట్లూ తమ సన్నాహాలను ప్రారంభించాయి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది. ఆ తర్వాతే ఆటగాళ్లపై వస్తోన్న ఊహాగానాలకు కూడా తెరపడనుంది. నివేదికల ప్రకారం, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను అహ్మదాబాద్ జట్టు ఎంచుకున్న సంగతీ తెలిసిందే. అహ్మదాబాద్ టీంకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరిస్తారని చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి, టీమ్ వైపు నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే దీనికి త్వరలోనే ఎండ్ కార్డ్ పడనున్నట్లు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కనిపిస్తాడా? ఫిట్‌నెస్ సమస్యలు, పేలవమైన ఫామ్ ఉన్నప్పటికీ అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేస్తుందా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. నివేదికల ప్రకారం, హార్దిక్‌కు కెప్టెన్సీని అప్పగించాలని జట్టు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా IPL అనేక సీజన్లలో ముంబై ఇండియన్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. హార్దిక్‌కి అహ్మదాబాద్‌లో ఆధిక్యత లభిస్తే, అతను మరోసారి తన అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హార్దిక్‌లో మంచి బ్యాటింగ్, బౌలింగ్ సామర్థ్యం కూడా ఉంది.
గత సీజన్‌లో ఫ్లాప్.. ఫిట్‌నెస్ సమస్య కారణంగా హార్దిక్ పాండ్యా IPL 2021లో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే అతని బ్యాట్ కూడా మౌనంగానే ఉంది. ఐపీఎల్‌కు సంబంధించి హార్దిక్ మ్యాచ్‌ల్లో 127 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొత్తం సీజన్‌లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీని తర్వాత, టీ20 ప్రపంచకప్‌లో కూడా అతనిపై జట్టు విశ్వాసం వ్యక్తం చేసింది. కానీ, అతను అంచనాలను అందుకోలేకపోయాడు. ముంబై ఇండియన్స్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడానికి ఇదే కారణం. ఇప్పుడు అతను కొత్త జట్టుతో ఆడబోతున్నాడు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనున్న మెగా వేలం తర్వాత కెప్టెన్, ప్లేయర్‌లకు సంబంధించిన వార్తలకు తెరపడనుంది.
Also Read: ICC T20 Team Of The Year: భారత ఆటగాళ్లకు అవమానం.. ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో నో ప్లేస్..!