IPL 2021, SRH: సన్‌రైజర్స్‌ ఫీల్డర్ సరికొత్త రికార్డ్.. ఐపీఎల్‌లో మొదటిసారి..

IPL 2021, SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి లీగ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగింది. ఇందులో

IPL 2021, SRH: సన్‌రైజర్స్‌ ఫీల్డర్ సరికొత్త రికార్డ్.. ఐపీఎల్‌లో మొదటిసారి..
Mohammed Nabi

Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2021 | 12:50 PM

IPL 2021, SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి లీగ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ గెలిచింది కానీ ప్లేఆఫ్‌లో మాత్రం చోటు సంపాదించలేకపోయింది. అయితే ఇదే మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒక ఆటగాడు తన పేరు మీద సరికొత్త రికార్డును నమోదు చేశాడు. మొహమ్మద్ నబీ ఐపిఎల్ మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నబీ మొత్తం 5 క్యాచ్‌లు పట్టి ఈ రికార్డ్‌ని సాధించాడు.

ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు తీసుకున్న మొట్టమొదటి ఫీల్డర్ మొహమ్మద్ నబీ. ఇతడు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జేమ్స్ నీషన్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్ క్యాచ్‌లు పట్టాడు. వికెట్ కీపర్‌గా కుమార్ సంగక్కర 2011లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు తీసుకున్నాడు. అప్పుడు అతను డెక్కన్ ఛార్జర్స్ కోసం ఆడుతున్నాడు. RCBకి వ్యతిరేకంగా కుమార్ సంగక్కర ఈ ఫీట్‌ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో నబీని చేర్చారు. విలియమ్సన్ పూర్తిగా ఫిట్‌గా లేడు. అతని స్థానంలో మనీష్ పాండేకు జట్టు కమాండ్ ఇచ్చారు. ఈ సీజన్‌లో SRH ప్రదర్శన ఆశించినంతగా లేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో నబీ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడాడు 34 పరుగులు చేశాడు. మూడు వికెట్లు కూడా తీశాడు. అతను IPL లో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడాడు, 180 పరుగులు చేశాడు. దీంతోపాటు 13 వికెట్లు కూడా అతని ఖాతాలో నమోదయ్యాయి.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొమ్మిది వికెట్లకు 235 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2021, RCB vs DC Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న భరత్, మ్యాక్స్‌వెల్

SRH vs MI: దుమ్ము రేపిన ముంబై ఇండియన్స్‌.. సన్‌ రైజర్స్‌పై ఘన విజయం..

Hyderabad Rains: హైదరాబాద్‌ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..