IPL 2021, MI vs KKR: కేకేఆర్ టార్గెట్ 156.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డును నెలకొల్పిన రోహిత్ శర్మ

ఐపీఎల్ 2021లో భాగంగా 34 వ మ్యాచులో ముంబై ఇండియన్స్ టీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడుతోంది.

IPL 2021, MI vs KKR: కేకేఆర్ టార్గెట్ 156.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డును నెలకొల్పిన రోహిత్ శర్మ
Mi Vs Kkr, Ipl 2021
Follow us

|

Updated on: Sep 23, 2021 | 9:35 PM

IPL 2021, MI vs KKR: ఐపీఎల్ 2021లో భాగంగా 34 వ మ్యాచులో ముంబై ఇండియన్స్ టీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడుతోంది. ఈ మ్యాచులో కేకేఆర్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ టీం తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ టీం ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహత్ శర్మ, క్వింటన్ డికాక్‌లు ఇద్దరూ కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆ తరువాత 9.2 ఓవర్లో రోహిత్ శర్మ (33 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు) రూపంలో ముంబై టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. నరేన్ బౌలింగ్‌ శుభ్మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 78 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక వికెట్ సమర్పించుకున్నాడు. సూర్య కుమార్ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాంత్ కిషన్‌తో కలిసి డికాక్ కేకేఆర్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే ముంబయి ఓపెనర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్‌లో తన 16వ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో తన అర్థ శతకాన్ని సాధించాడు. అనంతరం క్వింటన్ డికాక్ (54 పరుగులు, 42 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) ప్రసీద్ధ్ బౌలింగ్‌‌లో 14.5 ఓవర్‌లో నరేన్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 106 పరుగుల వద్ద మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

ముంబయి యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (14) రూపంలో టీం స్కోర్ 119 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను ఎంఐ టీం కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌‌లో 16.2 ఓవర్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం పొలార్డ్ 21, పాండ్యా 12 పరుగులతో నిలిచారు.

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రసిద్ కృష్ణ, ఫెర్గ్యూసన్ తలో 2 వికెట్లు, సునీల్ నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: MI vs KKR Live Score, IPL 2021: నాలుగో వికెట్ కోల్పోయిన ముంబయి టీం.. ఇషాన్ కిషన్ (14) ఔట్.. స్కోర్ 119/4

ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్ సాంగ్ రిలీజ్.. కొత్త అవతారంలో విరాట్, పొలార్డ్, రషీద్, మాక్స్‌వెల్‌..!

వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే