Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs KKR Highlights, IPL 2021: ముంబయి‌పై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనవిజయం.. చరిత్ర తిరగరాసిన మోర్గాన్ సేన

Venkata Chari

|

Updated on: Sep 23, 2021 | 11:14 PM

MI vs KKR Highlights in Telugu: ఇప్పటి వరకు ఎంఐ, కేకేఆర్ టీంల మధ్య 28 మ్యాచులు జరిగాయి. అందులో ఎంఐ 22, కేకేఆర్ కేవలం 6 మ్యాచులు గెలిచాయి.

MI vs KKR Highlights, IPL 2021: ముంబయి‌పై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనవిజయం.. చరిత్ర తిరగరాసిన మోర్గాన్ సేన
Mi Vs Kkr, Ipl 2021

IPL 2021, MI vs KKR: ఐపీఎల్ 2021లో భాగంగా 34 వ మ్యాచులో ముంబై ఇండియన్స్ టీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో కేకేఆర్ టీం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. కోల్‌కతా విజయంలో వెంకటేష్ అయ్యర్(53 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు), రాహుల్ త్రిపాఠి(74 పరుగులు, 42 బంతులు, 8 ఫోర్లు, 3 సిక్సులు) కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి 2 వ వికెట్‌కు 88 పరుగులు జోడించి, ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించారు. వీరిద్దరూ 176 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే సాధించింది. ముంబై బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 4వ స్థానానికి చేరుకుంది. ముంబయి ఇండియన్స్ 6వ స్థానానికి పడిపోయింది.

ఐపీఎల్ 2021లో భాగంగా 34 వ మ్యాచులో ముంబై ఇండియన్స్ టీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడుతోంది. ఈ మ్యాచులో కేకేఆర్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ టీం తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ టీం ముందు 156 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

ఐపీఎల్‌ 2021 రెండో దశలో భాగంగా నేడు ముంబయి ఇండియన్స్ టీం వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్‌టీంలు 34వ మ్యాచులో తలపడనున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన నాలుగు ఓటములతో, డిఫెండింగ్ ఛాంపియన్‌లు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ గత సీజన్‌లో యూఏఈలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన ముంబయి ఇండియన్స్.. ప్రస్తుతం 2021లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. అయితే ముంబయికి ఉన్న రికార్డ్స్ ప్రకారం చూస్తే తొలుత నెమ్మదిగా ప్రారంభించి, తరువాత కప్‌ను ఎగురవేసుకునే స్థాయికి చేరుకోవడంలో రోహిత్ టీం దిట్ట. ఇప్పటి వరకు కోల్‌కతా టీంపై మెరుగైన రికార్డును కలిగి ఉంది.

ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. అందులో ఎంఐ 22, కేకేఆర్ కేవలం 6 మ్యాచులు గెలిచాయి. కోల్‌కతాపై ఉత్తమ రికార్డును కలిగిన ఉన్న జట్లలో ముంబయి ఇండియన్స్ టీం తొలిస్థానంలో నిలిచింది. మరీ ఆ రికార్డును నేడు ముంబై టీం కాపాడుకోగలదా లేదో చూడాలి.

రెండో దశలో తొలి మ్యాచులో ఓడిన ముంబై టీం.. విజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కోల్‌కతాకు గట్టిపోటీ ఇవ్వగలదో లేదో చూడాలి. కోల్‌కతాపై ముంబై టీం అత్యధిక స్కోర్ 232 కాగా, అత్యల్ప స్కోర్ 67పరుగులుగా ఉంది. అలాగే ముంబయి ఇండియన్స్‌పై కేకేఆర్ టీం అత్యధికంగా 201, అత్యల్పంగా 108 పరుగులు సాధించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 23 Sep 2021 10:59 PM (IST)

    కోల్‌కతా టీం విజయం

    ముంబయి టీంపై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా టీం ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముంబయి ఇండియన్స్ 6వ స్థానానికి పడిపోయింది.

  • 23 Sep 2021 10:51 PM (IST)

    14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 147/1

    14 ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ఒక వికెట్ నష్టానికి 147 పరుగులు సాధించింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి 67, మోర్గాన్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి 36 బంతుల్లో మరో 9 పరుగులు కావాల్సి ఉంది.

  • 23 Sep 2021 10:40 PM (IST)

    2వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా టీం యంగ్ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ (53) రూపంలో కేకేఆర్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌‌లో బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు.

  • 23 Sep 2021 10:34 PM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన అయ్యర్

    కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ ముంబయి బౌలర్లపై విరుచుకపడుతున్నాడు. తొలి ఓవర్‌ నుంచే రెచ్చిపోయాడు. ఐపీఎల్‌తో తన రెండవ మ్యాచ్ ఆడుతున్న అయ్యర్ కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 23 Sep 2021 10:30 PM (IST)

    10 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 111/1

    10 ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ఒక వికెట్ నష్టానికి 111 పరుగులు సాధించింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 48, రాహుల్ త్రిపాఠి 43 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి 60 బంతుల్లో మరో 56 పరుగులు కావాల్సి ఉంది.

  • 23 Sep 2021 10:25 PM (IST)

    9 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 97/1

    9 ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు సాధించింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 46, రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Sep 2021 10:18 PM (IST)

    బౌండరీలతో బౌలర్ల భరతం పడుతోన్న అయ్యర్

    కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ ముంబయి బౌలర్లపై విరుచకపడుతున్నాడు. తొలి ఓవర్‌ నుంచే రెచ్చిపోయిడు ఆడుతున్నాడు. ఐపీఎల్‌తో తన రెండవ మ్యాచ్ ఆడుతున్న అయ్యర్ ఆర్‌సీబీపై కూడ తన ప్రతాపం చూపించాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 23 Sep 2021 10:14 PM (IST)

    పవర్ ప్లే‌లో అత్యధిక స్కోర్లు

    67 DC v KKR అహ్మదాబాద్ 65 DC v CSK ముంబై 65 RCB v CSK ముంబై 63 DC v PBKS అహ్మదాబాద్ 63 KKR v MI అబుదాబి *

  • 23 Sep 2021 10:11 PM (IST)

    6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 63/1

    6 ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 63 పరుగులు సాధించింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 33, రాహుల్ త్రిపాఠి 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Sep 2021 09:56 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా

    కోల్‌కతా టీం యంగ్ బ్యాట్స్‌మెన్ గిల్ (13) రూపంలో కేకేఆర్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌‌లో బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు.

  • 23 Sep 2021 09:51 PM (IST)

    2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 30/0

    2 ఓవర్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 30 పరుగులు సాధించింది. క్రీజులో గిల్ 8, వెంకటేష్ అయ్యర్ 22 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి ఓవర్‌ నుంచే ముంబై బౌలర్లపై ఈ ఇద్దరు విరుచపడుతున్నారు. ఇప్పటికే 2 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదేశారు.

  • 23 Sep 2021 09:42 PM (IST)

    కేకేఆర్ టార్గెట్ 156

    ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ టీం టార్గెట్ 156 పరుగులుగా మారింది.

  • 23 Sep 2021 09:24 PM (IST)

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ముంబయి

    ముంబయి బ్యాట్స్‌మెన్ పొలార్డ్ (21), పాండ్యా (12) రూపంలో వరుసగా ఎంఐ టీం రెండు వికెట్లను కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌‌లో 20 ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది.

  • 23 Sep 2021 09:14 PM (IST)

    18 ఓవర్లకు ఎంఐ స్కోర్ 139/4

    18 ఓవర్లకు ముంబయి ఇండియన్స్ టీం 139 పరుగులు సాధించింది. క్రీజులో పొలార్డ్ 20, పాండ్యా 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Sep 2021 09:03 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన ముంబయి

    ముంబయి యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (14) రూపంలో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌‌లో 16.2 ఓవర్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 119 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 23 Sep 2021 08:54 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన ముంబయి

    ముంబయి ఓపెనర్ క్వింటన్ డికాక్ (54 పరుగులు, 42 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రసీద్ధ్ బౌలింగ్‌‌లో 14.5 ఓవర్‌లో నరేన్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 106 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 23 Sep 2021 08:44 PM (IST)

    14 ఓవర్లకు ఎంఐ స్కోర్ 101/2

    14 ఓవర్లకు ముంబయి ఇండియన్స్ టీం 101 పరుగులు సాధించింది. క్రీజులో డికాక్ 54, ఇషాన్ కిషన్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Sep 2021 08:41 PM (IST)

    హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డికాక్

    ముంబయి ఓపెనర్ క్వింటన్ డికాక్ కేకేఆర్‌పై అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో తన అర్థ శతకాన్ని సాధించాడు. ఇది ఐపీఎల్ కెరీర్‌లో డికాక్‌కు 16వ హాఫ్ సెంచరీగా నమోదైంది.

  • 23 Sep 2021 08:35 PM (IST)

    2వ వికెట్ కోల్పోయిన ముంబయి

    ముంబయి యంగ్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ (5) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. ప్రసీద్ధ్ బౌలింగ్‌‌లో 12.1 ఓవర్‌లో కీపర్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 23 Sep 2021 08:31 PM (IST)

    12 ఓవర్లకు ఎంఐ స్కోర్ 89/1

    12 ఓవర్లకు ముంబయి ఇండియన్స్ టీం 89 పరుగులు సాధించింది. క్రీజులో డికాక్ 47, సూర్యకుమార్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Sep 2021 08:26 PM (IST)

    ఎక్కుసార్లు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపిన బౌలర్లు

    7 ఎంఎస్ ధోనీ vs జహీర్ ఖాన్ బౌలింగ్‌లో 7  విరాట్ కోహ్లీ vs సందీప్ శర్మ బౌలింగ్‌లో 7 రోహిత్ శర్మ vs సునీల్ నరైన్  బౌలింగ్‌లో

  • 23 Sep 2021 08:21 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ముంబయి

    ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (33 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. నరేన్ బౌలింగ్‌ 9.2 ఓవర్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 78 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.

  • 23 Sep 2021 08:17 PM (IST)

    9 ఓవర్లకు ఎంఐ స్కోర్ 77/0

    9 ఓవర్లకు ముంబయి ఇండియన్స్ టీం వికెట్ నష్ట పోకుండా 77 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 33, డికాక్ 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో రెండు ఫోర్లతో మొత్తం 14 పరుగులు రాబట్టారు. ముంబయి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 3 సిక్సులు, 7 ఫోర్లు వచ్చాయి.

  • 23 Sep 2021 08:11 PM (IST)

    ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్

    IPL లో అత్యధిక పరుగులు vs జట్టు: 1004* రోహిత్ శర్మ వర్సెస్ కేకేఆర్ 943 డేవిడ్ వార్నర్ vs పంజాబ్ కింగ్స్ 915 డేవిడ్ వార్నర్ వర్సెస్ కేకేఆర్ 909 విరాట్ కోహ్లీ వర్సెస్ డీసీ

  • 23 Sep 2021 08:05 PM (IST)

    అర్థసెంచరీ భాగస్వామ్యం

    ముంబయి ఓపెనర్లు రోహిత్ 27(4 ఫోర్లు), డికాక్ 27(3 సిక్సులు, 1 ఫోర్) ఇద్దరూ కలిసి 6 వ ఓవర్‌లో అర్థ సెంచరీ భాగస్వామన్ని నెలకొల్పారు. ముంబయి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 3 సిక్సులు, 5 ఫోర్లు వచ్చాయి.

  • 23 Sep 2021 08:00 PM (IST)

    6 ఓవర్లకు ఎంఐ స్కోర్ 56/0

    6 ఓవర్లకు ముంబయి ఇండియన్స్ టీం 56 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 27, డికాక్ 27 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్‌లో రెండు సిక్సులతో మొత్తం 16పరుగులు రాబట్టారు. ముంబయి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 3 సిక్సులు, 5 ఫోర్లు వచ్చాయి.

  • 23 Sep 2021 07:53 PM (IST)

    తొలి సిక్స్ బాదిన డికాక్

    ముంబయి ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ను డికాక్ బాదేశాడు. ఫెర్గ్యూసన్ వేసిన 5 ఓవర్‌ చివరి బంతిని 79 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు.

  • 23 Sep 2021 07:50 PM (IST)

    రోహిత్ అరుదైన రికార్డు

    వరుణ్ చక్రవర్తి వేసిన 4 ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీలుగా మలచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ అరుదైన రికార్డును పూర్తి చేశాడు. ఓ ఐపీఎల్‌ టీం 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

  • 23 Sep 2021 07:46 PM (IST)

    వరుస ఫోర్లతో విరుచపడుతోన్న రోహిత్

    వరుణ్ చక్రవర్తి వేసిన 4 ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీలుగా మలచిన రోహిత్, తన కం బ్యాక్‌ను ఘనంగా చాటుతున్నాడు. అలాగే కేకేఆర్ టీంపై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

  • 23 Sep 2021 07:44 PM (IST)

    3 ఓవర్లకు ఎంఐ స్కోర్ 20/0

    3 ఓవర్లకు ముంబయి ఇండియన్స్ టీం 20 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 13, డికాక్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Sep 2021 07:40 PM (IST)

    2 ఓవర్లకు ఎంఐ స్కోర్ 9/0

    2 ఓవర్లకు ముంబయి ఇండియన్స్ టీం 9 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 7, డికాక్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Sep 2021 07:33 PM (IST)

    తొలి బంతినే బౌండరీగా మలచిన రోహిత్

    ముంబయి టీం కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. నితీష్ రాణా వేసిన షార్ట్ పించ్‌ బంతిని ఫోర్‌గా మలచి తన రాకను గ్రాండ్‌గా చూపించాడు.

  • 23 Sep 2021 07:31 PM (IST)

    మొదలైన ముంబయి బ్యాటింగ్

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది రోహిత్ టీం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ బరిలోకి దిగారు.

  • 23 Sep 2021 07:28 PM (IST)

    సరికొత్త రికార్డుకు చేరువలో ఎంఐ కెప్టెన్ రోహిత్

    ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీంపై 1000 పరుగులకు కేవలం 18 పరుగుల దూరంలో నిలిచాడు. ఒకే టీంపై ఎక్కువ పరుగులు చేసిన లిస్టులో ఇప్పటికే తొలి స్థానంలో నిలిచిన రోహిత్.. 1000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు.

  • 23 Sep 2021 07:18 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

  • 23 Sep 2021 07:10 PM (IST)

    టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రౌడర్స్

    ఐపీఎల్ 2021లో భాగంగా నేడు ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ టీం తలపడనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ టీం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రోహిత్ టీం బ్యాటింగ్ చేయనుంది.

  • 23 Sep 2021 06:45 PM (IST)

    MI vs KKR: హెడ్ టూ హెడ్ రికార్డులు

    ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. అందులో ఎంఐ 22, కేకేఆర్ కేవలం 6 మ్యాచులు గెలిచాయి. కోల్‌కతాపై ఉత్తమ రికార్డును కలిగిన ఉన్న జట్లలో ముంబయి ఇండియన్స్ టీం తొలిస్థానంలో నిలిచింది. మరీ ఆ రికార్డును నేడు ముంబై టీం కాపాడుకోగలదా లేదో చూడాలి.

    రెండో దశలో తొలి మ్యాచులో ఓడిన ముంబై టీం.. విజయంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కోల్‌కతాకు గట్టిపోటీ ఇవ్వగలదో లేదో చూడాలి. కోల్‌కతాపై ముంబై టీం అత్యధిక స్కోర్ 232 కాగా, అత్యల్ప స్కోర్ 67పరుగులుగా ఉంది. అలాగే ముంబయి ఇండియన్స్‌పై కేకేఆర్ టీం అత్యధికంగా 201, అత్యల్పంగా 108 పరుగులు సాధించింది.

  • 23 Sep 2021 06:41 PM (IST)

    ఎంఐ వర్సెస్ కేకేఆర్ సమరానికి సిద్ధం

Published On - Sep 23,2021 6:31 PM

Follow us