IPL 2021 FINAL: ఫైనల్లో రికార్డుల వర్షం.. ధోని సరసన చేరేందుకు రాయుడి ఆరాటం.. 13 ఏళ్ల రికార్డుపై గైక్వాడ్ కన్ను.. లిస్టులో బ్రావో కూడా..!
CSK vs KKR: ఐపీఎల్ -2021 ఫైనల్ ఈరోజు రాత్రి 7.30 గంటల నుంచి మొదలుకానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలు దుబాయ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి.
IPL 2021 FINAL, CSK vs KKR: ఐపీఎల్ -2021 ఫైనల్ ఈరోజు రాత్రి 7.30 గంటల నుంచి మొదలుకానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలు దుబాయ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఒక వైపు, 2014 తర్వాత కోల్‌కతా ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు చెన్నై జట్టు 2019 తర్వాత ఫైనల్‌కు చేరుకుంది.
ఈ సీజన్‌లో ఐపీఎల్ రెండు చోట్ల జరిగింది. తొలి దశ మ్యాచులు భారత్‌లో జరగగా, రెండో దశ మ్యాచులు యూఏఈలో జరిగాయి. కరోనా కారణంగా యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురవనుంది. అవేంటో తెలుసుకుందాం.
డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధికంగా వికెట్లు తీసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ డ్వేన్ బ్రావో 150 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 166 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 22 పరుగులకు 4 వికెట్లుగా నమోదయ్యాయి. ఈ రోజు మ్యాచ్‌లో ఈ ఆటగాడు 5 వికెట్లు తీస్తే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో మారనున్నాడు.
అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 164 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 3916 పరుగులు రాలాయి. అతని సగటు 29.44గా నమోదైంది. అదే సమయంలో రాయుడు ఉత్తమ స్కోరు 100 నాటౌట్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో రాయుడు బ్యాట్ నుంచి 84 పరుగులు సాధిస్తే ప్రస్తుత చెన్నై ఆటగాళ్లలో 4000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా మారనున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ యంగెస్ట్ ఆరెంజ్ క్యాప్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటతీరుతో ఈ సీజన్‌లో ఆకట్టుకున్నాడు. ఈరోజు మ్యాచ్‌లో గైక్వాడ్ మరో 23 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్‌ని అధిగమించి, ఆరెంజ్ క్యాప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా మారనున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ మాజీ ఓపెనర్ షాన్ మార్ష్ పేరు మీద ఉంది. 2008లో 25 సంవత్సరాల వయస్సులో 616 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం గైక్వాడ్ వయస్సు 24 సంవత్సరాలు.
కోల్‌కతా ఐపీఎల్ ఫైనల్‌లో ఓడిపోలేదు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇంతకు ముందు 2014, 2012 సంవత్సరాల్లో కూడా ఈ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. రెండు సార్లు కోల్‌కతా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహించాడు.
Also Read: IPL 2021 final: ఫైనల్ చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు.. మరి ఫైనల్లో వారు ఎలా ఆడతారో..
IPL 2021: టీ20 ఫార్మెట్‌కు అశ్విన్ పనికిరాడు.. మాజీ క్రికెటర్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
IPL 2021 Final: కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కెప్టెన్ ఔట్.. మోర్గాన్ స్థానంలో సారథిగా ఎవరంటే?