IPL 2021 final: ఫైనల్ చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు.. మరి ఫైనల్‌లో వారు ఎలా ఆడతారో..
ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2021 ఫైనల్‌లో ఎంఎస్ ధోని నోతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తో తలపడుతుంది. ఈ ఐపీఎల్లో సీఎస్‌కే జట్టు ఢిల్లీని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది...
ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2021 ఫైనల్‌లో ఎంఎస్ ధోని నోతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తో తలపడుతుంది. ఈ ఐపీఎల్లో సీఎస్‌కే జట్టు ఢిల్లీని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ కేకేఆర్ బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్‌ను ఓడించి.. తర్వాత ఢిల్లీని మట్టి కరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ అనుహ్య ఆట తీరుతో ఫైనల్‌కు చేరింది. అయితే సీఎస్‌కే, కేకేఆర్ ఫైనల్ వెళ్లడంలో వారివారి జట్ల ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వెంకటేశ్ అయ్యర్, రుత్‌రాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, ఎంఎస్ ధోనీ తమ ఆటతో జట్లను ఫైనల్‌కు చేర్చారు.
వెంకటేశ్ అయ్యర్ యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2021లో వెంకటేశ్ అయ్యర్ తన ఆటతో కేకేఆర్ జట్టకు విజయాలను అందిస్తున్నాడు. అతను భారత జట్టకు ఎంపికయ్యేలా తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్‌లో ఎలా ఆడుతాడో ఎదురు చూస్తున్నారు. కేకేఆర్ పునరాగమనంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కీలక పాత్ర పోషించాడు.9 మ్యాచ్‌లలో 320 పరుగులు చేశాడు. అతన్ని ఐపీఎల్ తర్వాత యూఏఈలో ఉంటాడు. టీం ఇండియాకు టీ 20 వరల్డ్ కప్ 2021 కోసం సిద్ధం కావడానికి అతను సహాయం చేస్తాడు.
రుతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ గైక్వాడ్ జాతీయ జట్టులో భాగం కానప్పటికీ ఆరెంజ్ క్యాప్‌ని గెలుచుకునే రేసులో ఉన్నాడు. అతను 603 పరుగులు చేసి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో 2 వ స్థానంలో నిలిచాడు. 626 కెఎల్ రాహుల్ మొదటి స్థానంలో ఉన్నాడు. పంజాబ్ ఫైనల్‌కు వెళ్లలేదు కాబట్టి ఆరెంజ్ క్యాప్ గెలుకునేందుకు అతడికి అవకాశం. ఢిల్లీతో జరిగిన క్వాలీఫైయర్ మ్యాచులో గైక్వాడ్ 70 పరుగలుు చేశాడు.
ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో అతను ఒక చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, MS ధోనీ యొక్క ఫినిషింగ్ సామర్ధ్యాలు సాటిలేనివని అభిమానులు చెబుతున్నారు. ఢీల్లితో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నిగ్స్ ఆడిన ధోనీ జట్టకు విజయాన్ని అందించారు.
రాహుల్ త్రిపాఠి రాహుల్ త్రిపాఠి ఐపీఎల్లో అత్యంత మెరుగైన బ్యాట్స్‌మెన్లలో ఒకరిగా నిలిచాడు. కేకేఆర్‌ను క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షించాడు. 2 వ క్వాలిఫయర్‌లో చివరి ఓవర్లో సిక్స్ కొట్టి తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయం అందించాడు.
Read Also.. T20 World Cup: జట్టులో చాలా మంది వికెట్ కీపర్లు ఉన్నారు.. ఎవరు ఆడుతారో చూద్దాం.. పంత్‌కు కోహ్లీ హెచ్చరిక!..