MS.Dhoni: నెట్స్‌లో చెమటోర్చిన ఎంఎస్ ధోనీ.. ఫైనల్లో హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్ గెలిపిస్తాడా..
శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఐపీఎల్ 2021 ఫైనల్‌కు సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 1లో అద్భుతంగా ఆడాడు...
శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఐపీఎల్ 2021 ఫైనల్‌కు సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 1లో అద్భుతంగా ఆడాడు. 6 బంతుల్లో 18 పరుగులు చేసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. సీఎస్కేకు నాలుగో IPL టైటిల్ అందించేందుకు ధోనీ ఎదురుచూస్తున్నాడు. గ్రాండ్ ఫినాలేకి ముందు మాహి నెట్స్‌లో చెమటోర్చుతున్నాడు. అతను తన ట్రేడ్‌మార్క్ హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్ గెలిపించాలని చూస్తున్నాడు.
MS ధోని హెలికాప్టర్ షాట్ ఐపీఎల్ ఫైనల్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. IPL 2021 ఫైనల్‌కు ముందు, ‘ఎల్లో ఆర్మీ’ వారి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో ఎంఎస్ ధోనీ నెట్స్‌లో కొన్ని దూకుడుగా క్రికెట్ షాట్లు ఆడాడు.
2012 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న చెన్నై చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే ఐపీఎల్ ఫైనల్లో ఇరు జట్లు ఒకదానితో ఒకటి తలపడడం ఇది రెండోసారి. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కేకేఆర్ 2012 లో జరిగిన ఐపీఎల్ టైటిల్ పోరులో చైన్నై టీం ఓడిపోయింది. ధోని ఐదు వికెట్ల తేడాతో పరాయం పాలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండో విజయం సాధించడానికి ఎదురు చూస్తుండగా, ఎంఎస్‌డీ అండ్ కో 2012 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది.
View this post on Instagram
Read Also.. IPL 2021 final: ఫైనల్ చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు.. మరి ఫైనల్లో వారు ఎలా ఆడతారో..