IPL 2021 Final: కోల్‌కతా ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి కెప్టెన్ ఔట్.. మోర్గాన్ స్థానంలో సారథిగా ఎవరంటే?

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs KKR) IPL 2021 ఫైనల్లో పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ శుక్రవారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది.

IPL 2021 Final: కోల్‌కతా ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి కెప్టెన్ ఔట్.. మోర్గాన్ స్థానంలో సారథిగా ఎవరంటే?
Csk Vs Kkr, Ipl 2021 Eoin Morgan
Follow us

|

Updated on: Oct 14, 2021 | 9:59 PM

IPL 2021 Final:  ఐపీఎల్ 2021 చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం చెన్నై వర్సెస్ కోల్‌కతా సన్నద్ధమయ్యాయి. రెండు జట్ల ఆటగాళ్లు రంగంలో ఉన్నారు. పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

మోర్గాన్ ఔట్? మైఖేల్ వాన్ క్రిక్‌బజ్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. ఇయోన్ మోర్గాన్ అతని స్థానంలో ఆండ్రీ రస్సెల్‌కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు. రస్సెల్ గత ఐదు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కానీ, ప్స్తుతం రస్సెల్ గాయం నయమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ టీం షార్జాలో ఆడింది. అక్కడ వారికి పిచ్ ఎంతో కలిసి వచ్చింది. కానీ, దుబాయ్‌లో కొన్ని పరాజయాలు ఉన్నాయి. ఆండ్రీ రస్సెల్ నాలుగు ఓవర్లు వేయగలిగితే, షకీబ్ అల్ హసన్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి రావొచ్చు. అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ని తీసుకోవడం ఎంతవరకు సరైనది. ఇయాన్ మోర్గాన్ తనను తాను దూరంగా ఉండనున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాడు.

నిరాశపరిచిన పరిచిన మోర్గాన్.. కేకేఆర్ కెప్టెన్ పనితీరు చాలా నిరాశపరిచింది. అతను 16 ఇన్నింగ్స్‌లలో కేవలం 11.72 సగటుతో 129 పరుగులు చేయగలిగాడు. మొత్తం సీజన్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఈ సీజన్‌లో అతను 4 సార్లు సున్నాపై పెవిలియన్‌కు చేరాడు. ఒక సీజన్‌లో నాలుగు సార్లు ఖాతా తెరవలేని ఏకైక ఐపీఎల్ కెప్టెన్ మోర్గాన్. ఈ సీజన్‌లో మోర్గాన్ 10 ఇన్నింగ్స్‌లలో డబుల్ ఫిగర్‌ను తాకలేకపోయాడు. ఐపీఎల్‌లో ఏ ఆటగాడు ఇంత దారుణంగా ప్రదర్శన చేయలేదు. మోర్గాన్ మంచి ఫామ్‌లో లేడని, తనను తాను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూరంగా ఉంటే, అది కోల్‌కతాకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టమైంది. మోర్గాన్ లేనప్పుడు, దినేశ్ కార్తీక్ బాధ్యతలు చేపట్టవచ్చు.

Also Read: 12 మ్యాచ్‌ల్లో 85 పరుగులు.. 4 సార్లు డకౌట్‌లు.. పంజాబ్ ఆశలను ముంచాడు.. టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం దంచేస్తానంటోన్న ప్లేయర్..!

KKR vs DC Qualifier 2 Result: వాట్ ఏ మ్యాచ్.. చివరి ఓవర్లో ఫలితం.. 3 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన కోల్‌కతా.. ఢిల్లీకి మరో ‘సారీ’