IPL 2021: టీ20 ఫార్మెట్‌కు అశ్విన్ పనికిరాడు.. మాజీ క్రికెటర్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
Ravichandran Ashwin: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్‌లో పలు రికార్డులు సాధించిన అశ్విన్ టీ20 ఫార్మెట్‌కు పనికిరాడని అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌కు పొట్టి క్రికెట్‌లో వికెట్లు తీసే సామర్థ్యమే లేదని విమర్శించాడు. ఐపీఎల్‌లో గత ఐదేళ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు అశ్విన్ భారంగా మారినట్లు వ్యాఖ్యానించాడు. అశ్విన్ ద్వారా ఆ జట్లకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అశ్విన్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఒరిగింది ఏమీ లేదన్నారు. తానైతే అశ్విన్‌ను తన జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు.
అశ్విన్ ఏ జట్టుకీ కీలక బౌలర్ కాదని పేర్కొన్న మంజ్రేకర్.. అతడి గురించి మాట్లాడి ఇప్పటికే చాలా సమయాన్ని వృథా చేశామని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్‌లో మాత్రం అశ్విన్ అద్భుతమైన బౌలర్‌గా మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం విడ్డూరమన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ – కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ చివరి ఓవర్‌లో కేకేఆర్‌కు ఏడు పరుగులు అవసరం. అశ్విన్ బంతి అందుకున్నాడు. తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ..మూడో బంతికి షకీబ్‌ను, నాలుగో బంతికి అక్షర్‌ను ఔట్ చేశాడు. అయితే, ఐదో బంతిని త్రిపాఠి సిక్స్ చేయడంతో కేకేఆర్ విజయం సాధించింది. దీంతో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌పై ప్రస్తావిస్తూ మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Also Read..
Raja Raja Chora: ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమా..
Naveen Chandra: ‘తగ్గేదే లే’ అంటున్న నవీన్ చంద్ర.. ఆసక్తికరంగా టీజర్ విడుదల