
జైపుర్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. మొదటి నుంచీ చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కాగా రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్(28) జాస్‌బట్లర్(23) అత్యధిక పరుగులు చేశారు. మిగతా వారు తక్కువ పరుగులకే పరిమితమవడంతో చివర్లో శ్రేయస్ గోపాల్(19), జోఫ్రా ఆర్చర్(13) బౌండరీలు బాది రాజస్థాన్ స్కోరును 150 పరుగులు దాటించారు. మరోవైపు చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.