Ishan Kishan: దులిప్‌ ట్రోఫీ నుంచి తప్పుకోవడంపై విమర్శలు.. అసలు కారణమేంటో బయటపెట్టిన ఇషాన్‌ కిషన్‌

జూన్ 28న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు సారథ్యం వహించాలని జోన్ సెలక్షన్ కమిటీ కన్వీనర్ దేబాశిష్ చక్రవర్తి కిషన్‌ను కోరారు. అయితే కిషన్ ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. దీంతో ఈ యువ క్రికెటర్‌కి రెడ్‌ బాల్‌ క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయిందని విమర్శలు వచ్చాయి.

Ishan Kishan: దులిప్‌ ట్రోఫీ నుంచి తప్పుకోవడంపై విమర్శలు.. అసలు కారణమేంటో బయటపెట్టిన  ఇషాన్‌ కిషన్‌
Ishan Kishan

Updated on: Jun 18, 2023 | 11:46 AM

త్వరలో భారత్‌లో ప్రారంభం కానున్న దేశీ లీగ్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు నాయకత్వం వహించేందుకు టీమిండియా వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ ఇషాన్ కిషన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు టోర్నీలో ఆడనంటూ లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇషాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడే అంత యాటిట్యూడ్‌ ఎందుకు చూపిస్తున్నావంటూ నెట్టింట ట్రోల్స్‌ వచ్చాయి. జూన్ 28న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు సారథ్యం వహించాలని జోన్ సెలక్షన్ కమిటీ కన్వీనర్ దేబాశిష్ చక్రవర్తి కిషన్‌ను కోరారు. అయితే కిషన్ ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. దీంతో ఈ యువ క్రికెటర్‌కి రెడ్‌ బాల్‌ క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయిందని విమర్శలు వచ్చాయి. అయితే త్వరలో జరగనున్న వెస్టిండీస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకునే ఇషాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉంటాలనుకుంటున్న ఈ యంగ్ ప్లేయర్ ఇందుకోసం బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ తీసుకునేందుకు రెడీ అయ్యాడట.

కాగా అంతర్జాతీయ సిరీస్‌ల మధ్య గ్యాప్ ఉన్నప్పుడు ఆటగాళ్లు ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి బెంగళూరులోని NCAకి వెళతారు. కిషన్ చివరిసారిగా మే 26న ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఈక్రమంలో ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడనందున, కిషన్ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవబానికి ఎన్‌ సీఏకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే వెస్టిండీస్ పర్యటనకు సంబంధించిన కిషన్ కు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా WTC ఫైనల్‌ తర్వాత టీమిండియాకు సుమారు నెలరోజుల పాటు విశ్రాంతి దొరకనుంది. తర్వాత పూర్తి సిరీస్ కోసం భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..