ICC Women World Cup 2022: ఐసీసీ వరల్డ్ కప్‌ 2022 భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?

Team India: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 న్యూజిలాండ్‌లో జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టు మిథాలీ రాజ్‌ సారథ్యంలో ఆడనుంది.

ICC Women World Cup 2022: ఐసీసీ వరల్డ్ కప్‌ 2022 భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?
Icc Women World Cup 2022
Follow us
Venkata Chari

|

Updated on: Jan 06, 2022 | 10:50 AM

ICC Women World Cup 2022: న్యూజిలాండ్‌లో జరగనున్న మహిళల ప్రపంచకప్ 2022 కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ప్రపంచకప్‌నకు హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. అలాగే రిచా ఘోష్, తానియా భాటియా వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. జెమీమా రోడ్రిగ్స్, శిఖా పాండే, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, వేదా కృష్ణమూర్తి వంటి ముఖాలకు భారత జట్టులో చోటు దక్కలేదు. జెమీమా ఎంపిక కాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఇటీవల ఇంగ్లాండ్‌లోని హండ్రెడ్, ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల బిగ్ బాష్ లీగ్‌లలో అద్భుతంగా ఆడింది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022, న్యూజిలాండ్ వన్డేల కోసం భారత జట్టు మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (కీపర్) ), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్స్: సబ్బినెనే మేఘనా, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్

న్యూజిలాండ్‌ టూర్‌లో ఆతిథ్య జట్టుతో భారత్‌ కూడా టీ20 మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అది ఫిబ్రవరి 9న జరగాల్సి ఉంది. ఇందుకోసం టీమ్‌ని కూడా ప్రకటించారు. ఈ మ్యాచ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు.

టీ20 మ్యాచ్‌కి భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.. హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (కీపర్), రాజేశ్వరి గైక్వాడ్ , పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, ఎస్ మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.

Also Read: 3 బంతులు ఆడిన తర్వాత వెళ్లిపోమన్నారు.. నువ్వు పనికిరావన్నారు.. కానీ ఇండియన్ కెప్టెన్‌గా 3 వరల్డ్‌ కప్‌లకి నాయకత్వం వహించాడు..?

Happy Birthday Kapil Dev: చిరస్మరణీయం కపిల్ కెరీర్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి ప్రపంచ కప్‌ అందించిన భారత దిగ్గజం..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?