IPL 2024: ఇకపై బ్యాటర్లు భయపడాల్సిందే.. బౌలర్లకు ఊరటనిచ్చేలా కొత్త రూల్.. ఐపీఎల్ 2024 నుంచి షురూ..

IPL 2024: దీనికి తోడు ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లో ఉంటుంది. అంటే, టాస్ సమయానికి జట్లు ప్లేయింగ్ 11 ప్రకటించే సమయంలోనే, మరో 5గురు ఆటగాళ్లను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ 5 మంది ఆటగాళ్లలో ఎవరైనా ఒక ఆటగాడిని మ్యాచ్ మధ్యలో మరొక ఆటగాడితో భర్తీ చేయవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపిక రెండు జట్లకు వారి వ్యూహం, అవసరాల ప్రకారం ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి ఒక ప్లేయర్‌ను భర్తీ చేసే అవకాశాన్ని ఇస్తుంది.

IPL 2024: ఇకపై బ్యాటర్లు భయపడాల్సిందే.. బౌలర్లకు ఊరటనిచ్చేలా కొత్త రూల్.. ఐపీఎల్ 2024 నుంచి షురూ..
Ipl 2024 New Rules
Follow us

|

Updated on: Dec 20, 2023 | 12:26 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17కి రంగం సిద్ధమైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ముందు ఐపీఎల్‌లో కొన్ని నిబంధనలను మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం ఐపీఎల్ సీజన్‌ 17లో బౌలర్లు ఒకే ఓవర్‌లో 2 బౌన్సర్లు వేయడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఒక ఓవర్‌లో ఒక బౌన్సర్ మాత్రమే వేసేందుకు అనుమతి ఉంది. 2వ బౌన్సర్‌ను అంపైర్ నో బాల్‌గా పరిగణిస్తుంటారు.

కానీ, వచ్చే ఐపీఎల్‌ సీజన్ నుంచి ఒకే ఓవర్‌లో 2 బౌన్సర్లు విసిరే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాట్స్‌మన్‌, బౌలర్‌ల మధ్య పోటీని హోరీహోరీగా మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది.

దీనికి తోడు ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లో ఉంటుంది. అంటే, టాస్ సమయానికి జట్లు ప్లేయింగ్ 11 ప్రకటించే సమయంలోనే, మరో 5గురు ఆటగాళ్లను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ 5 మంది ఆటగాళ్లలో ఎవరైనా ఒక ఆటగాడిని మ్యాచ్ మధ్యలో మరొక ఆటగాడితో భర్తీ చేయవచ్చు.

ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపిక రెండు జట్లకు వారి వ్యూహం, అవసరాల ప్రకారం ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి ఒక ప్లేయర్‌ను భర్తీ చేసే అవకాశాన్ని ఇస్తుంది. అయితే, ఈ రూల్ తప్పక ఉపయోగించాలనే నియమం లేదు. అంటే, ఇటువంటి ఎంపికను ఉపయోగించుకోవడం ఆయా జట్లు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఈసారి ఐపీఎల్ ఓవర్లలో 2 బౌన్సర్లు ఉన్న మాట వాస్తవమే. కాబట్టి బ్యాట్స్‌మెన్‌లో ఆందోళన మరింత పెరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒక బౌన్సర్ పూర్తయిన తర్వాత మళ్లీ బౌన్సర్ వేయరు అని తెలిసిందే. కానీ, ఈసారి 6 బంతుల్లో 2 బౌన్సర్లు ఉండటంతో బౌలర్లు పరిస్థితిని బట్టి బౌన్సర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందువల్ల చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంచనా వేయవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్