SRH Full Squad: ఎస్‌ఆర్‌హెచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ప్లేయర్లు.. హైదరాబాద్ పూర్తి జట్టు ఎలా ఉందంటే..
SRH Full Squad for IPL 2024: ఐపీఎల్ 2024 వేలానికి ముందు, సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా అనుభవజ్ఞులైన టీ20ల్లో సత్తా చాటగలిగే యువ ప్రతిభతో నిండి ఉంది. హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్లతోపాటు అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన యువకులను రిటైన్ చేసుకుంది. అలాగే, యువ ప్రతిభకు పట్టం కట్టడంలోనూ ముందుటామంటూ నిరూపించుకుంది.
Sunrisers Hyderabad Full Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 లో అద్భుతమైన ప్రచారం సాగించేందుకు సిద్ధంగా ఉంది. ఐపీఎల్ 2024 వేలంలో షాకింగ్ బిడ్డింగ్‌లతో కీలక ప్లేయర్లను స్వ్కాడ్‌లో చేర్చుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్రస్తుతం అన్ని రంగాల ఆటగాళ్లతో ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తోంది. రూ.34 కోట్లతో వేలంలోకి ప్రవేశించిన ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ అగ్రశ్రేణి ఆటగాళ్ల సేవలను పొందేందుకు వేలంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. హైదరాబాద్ జట్టులో కేవలం ఆరు స్లాట్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో, సన్‌రైజర్స్ జట్టు చాలా తెలివిగా నడుచుకుంది.
వేలంలో SRH దూకుడు..
IPL 2024 వేలానికి ముందు, సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా అనుభవజ్ఞులైన టీ20ల్లో సత్తా చాటగలిగే యువ ప్రతిభతో నిండి ఉంది. హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్లతోపాటు అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన యువకులను రిటైన్ చేసుకుంది. అలాగే, యువ ప్రతిభకు పట్టం కట్టడంలోనూ ముందుటామంటూ నిరూపించుకుంది.
హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బహుముఖ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను కొనుగోలు చేసింది. అలాగే, హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్ వంటి ప్రముఖ ఆటగాళ్లకు జట్టు వీడ్కోలు పలికింది.
ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
ట్రావిస్ హెడ్: రూ. 6.80 కోట్లు
వనిందు హసరంగా: రూ. 1.5 కోట్లు
పాట్ కమిన్స్: రూ. 20.50 కోట్లు
జయదేవ్ ఉనద్కత్: రూ. 1.60 కోట్లు
ఆకాష్ సింగ్: రూ. 20 లక్షలు
జాతవేద్ సుబ్రమణ్యన్: రూ. 20 లక్షలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు..
IPL 2024. HERE. WE. COME. 🧡🔥#HereWeGOrange pic.twitter.com/wPY2K0Wnet
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
IPL 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పూర్తి జట్టు: గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్‌హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వాన్ పట్‌మిన్, వాన్‌గాస్ పట్మిన్ , జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..