AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: సెక్యూరిటీ గార్డ్ కుమారుడిపై కోట్ల వర్షం.. ఒక్క రాత్రిలో మారిన జార్ఖండ్ యువకుడి జాతకం..

Robin Minz: ఈ ఐపీఎల్ వేలంలో జార్ఖండ్ తరపున రాబిన్ మింజీ రూ.20 లక్షల బేస్ ధరతో వేలం బరిలో నిలిచాడు. రాబిన్ మింజీ పేరు వినిపించడంతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలుపై ఆసక్తి చూపింది. ఆ తర్వాత CSK, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేలం వేశాయి. దీంతో రూ. 20 లక్షలు ఉన్న రాబిన్ మింజ్ నికర విలువ రూ.3 కోట్లు దాటింది.

IPL 2024: సెక్యూరిటీ గార్డ్ కుమారుడిపై కోట్ల వర్షం.. ఒక్క రాత్రిలో మారిన జార్ఖండ్ యువకుడి జాతకం..
Ipl 2024 Gt Robin Minz
Venkata Chari
|

Updated on: Dec 20, 2023 | 12:37 PM

Share

Gujarat Titans Full Squad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ద్వారా చాలా మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని మార్చుకున్నారు. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా, మరికొందరు ఆటగాళ్లు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నా రు. ఇలా ఒక్కరోజులో కోటీశ్వరులుగా మారిన ఆటగాళ్ల జాబితాలోకి రాబిన్ మింజ్ (Robin Minz) కొత్త చేరిక.

ఈ ఐపీఎల్ వేలంలో జార్ఖండ్ తరపున రాబిన్ మింజీ రూ.20 లక్షల బేస్ ధరతో వేలం బరిలో నిలిచాడు. రాబిన్ మింజీ పేరు వినిపించడంతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలుపై ఆసక్తి చూపింది. ఆ తర్వాత CSK, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేలం వేశాయి. దీంతో రూ. 20 లక్షలు ఉన్న రాబిన్ మింజ్ నికర విలువ రూ.3 కోట్లు దాటింది.

చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.3.6 కోట్లతో దక్కించుకుంది. దీంతో ఈ జార్ఖండ్‌ యువ వికెట్‌ కీపర్‌ కం బ్యాట్స్‌మన్‌ కూడా అవకాశం వస్తే సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి రాబిన్ మింజీ గుజరాత్ టైటాన్స్ జట్టులో కనిపించనున్నాడు.

తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా..

రాబిన్ మింజ్ తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ప్రస్తుతం రాంచీలోని ముండా విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు తన కొడుకు ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్‌కి ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

21 ఏళ్ల యువ ఆటగాడు..

రాబిన్ మింజే 21 ఏళ్ల యువ వికెట్ కీపర్. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మింజ్ క్రికెట్‌పై తన దృష్టిని కేంద్రీకరించాడు. ఫలితంగా, అతను జులైలో ముంబై ఇండియన్స్ UK పర్యటనకు ఎంపికయ్యాడు. అతను U-19, U-25 జార్ఖండ్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు.

ధోనీకి పెద్ద ఫ్యాన్..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రాబిన్ మింజే వీరాభిమాని. ధోనీ వికెట్లు కీపింగ్ చేసే విధానం నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. “నేను ధోని ప్రశాంత స్వభావం, నాయకత్వం నుంచి ప్రేరణ పొందాను” అంటూ రాబిన్ మింజ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి గత కొన్నేళ్లుగా చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల ఇప్పుడు రాబిన్ మింజ్ అదృష్టవంతుడయ్యాడు. మరి ఈ అదృష్టాన్ని యువ వికెట్ కీపర్ దండిగ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

గుజరాత్ టైటాన్స్ జట్టు: డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్ జాషువా లిటిల్, మోహిత్ శర్మ. అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మింజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..