భారత్ ఓపెనర్ల ఖాతాలో అరుదైన రికార్డు!

|

Jul 06, 2019 | 11:35 PM

లండన్: భారత్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ప్రపంచకప్‌లో అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ సీజన్‌లో తొలి సెంచరీ కేఎల్ రాహుల్ నమోదు చేయడంతో ఈ రికార్డు సాధ్యమైంది. ప్రపంచకప్‌లలో ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేసిన రికార్డు అందుకున్న వీరు.. గతంలో ఈ రికార్డు నమోదు చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్లు తరంగ, దిల్షాన్ తర్వాతి స్థానంలో నిలిచారు. కాగా 2011 ప్రపంచకప్‌లో జింబాబ్వే, ఇంగ్లాండ్‌పై తరంగ, దిల్షాన్ ఈ ఘనత అందుకోగా.. భారత్ ఓపెనర్లు తొలిసారి […]

భారత్ ఓపెనర్ల ఖాతాలో అరుదైన రికార్డు!
Follow us on

లండన్: భారత్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ప్రపంచకప్‌లో అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ సీజన్‌లో తొలి సెంచరీ కేఎల్ రాహుల్ నమోదు చేయడంతో ఈ రికార్డు సాధ్యమైంది. ప్రపంచకప్‌లలో ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేసిన రికార్డు అందుకున్న వీరు.. గతంలో ఈ రికార్డు నమోదు చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్లు తరంగ, దిల్షాన్ తర్వాతి స్థానంలో నిలిచారు.

కాగా 2011 ప్రపంచకప్‌లో జింబాబ్వే, ఇంగ్లాండ్‌పై తరంగ, దిల్షాన్ ఈ ఘనత అందుకోగా.. భారత్ ఓపెనర్లు తొలిసారి ఈ ఫీట్ సాధించారు. అటు హెడింగ్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మకు దక్కింది.