MS Dhoni Garage Video: ధోని మాములోడు కాదు భయ్యా.. కార్లు, బైక్‌ల కోసం ఏకంగా భారీ గ్లాస్ గ్యారేజ్ కట్టించాడుగా..

Mahendra Singh Dhoni: ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాన్నాళ్లైంది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సంవత్సరం అతను వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అభిమానుల ఒత్తిడితో రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకున్నాడు. ఈ టోర్నీ అతనికి వీడ్కోలు టోర్నీ అవుతుందని అంతా భావిస్తున్నారు. దీని ద్వారా ధోని అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.

MS Dhoni Garage Video: ధోని మాములోడు కాదు భయ్యా.. కార్లు, బైక్‌ల కోసం ఏకంగా భారీ గ్లాస్ గ్యారేజ్ కట్టించాడుగా..
Dhoni's Glass Garage

Updated on: Jan 29, 2024 | 10:56 AM

MS Dhoni Garage Video: భారత జట్టు మాజీ ఆటగాడు, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి బైక్, కార్లంటే ఎంతో పిచ్చి. ఖాళీ సమయంలో ధోని చాలాసార్లు పాతకాలపు కార్లు, బైక్‌లు నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో ఏకంగా వీటి కోసం ఓ గ్యారేజ్ కూడా నిర్మించాడు. ధోనీ భారీ గ్లాస్ గ్యారేజ్ వీడియో వైరల్‌గా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత సంవత్సరం, వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి రాంచీలోని ధోని ఇంటికి వచ్చిన సమయంలో ధోని ఫామ్ హౌస్‌లోని బైక్‌లు, కార్ల వీడియోను పంచుకున్నారు. ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే, షాదాబ్ సైఫీ అనే యూట్యూబ్ ఛానల్‌లో ధోనీ గ్లాస్ గ్యారేజ్ ఇంటీరియర్ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే, ధోని అరుదైన బైక్‌లు, కార్ల సేకరణకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, ధోనీ భార్య సాక్షి ధోని ఈ గ్యారేజ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “ఈ అబ్బాయికి అతని బొమ్మలంటే ఎంతో ఇష్టం” అంటూ క్యాప్షన్ అందించింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ (IPL 2024)లో కనిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 17వ ఎడిషన్ కోసం ఇప్పటికే శిక్షణను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఈ ఎడిషన్ కోసం జరిగిన ప్లేయర్ల మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసి జట్టును బలోపేతం చేసింది. గత టోర్నీలో కొందరి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కప్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఈసారి పటిష్టంగా కనిపించిన చెన్నై జట్టు మళ్లీ కప్ గెలవడం ఖాయమని టోర్నీ ప్రారంభానికి ముందే అభిమానుల అంచనాలు మొదలయ్యాయి.

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాన్నాళ్లైంది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సంవత్సరం అతను వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అభిమానుల ఒత్తిడితో రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకున్నాడు. ఈ టోర్నీ అతనికి వీడ్కోలు టోర్నీ అవుతుందని అంతా భావిస్తున్నారు. దీని ద్వారా ధోని అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాడంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం క్రికెట్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అయితే ఒక్కటి మాత్రం నిజం, క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆర్మీలో కొంత కాలం పనిచేస్తానని, అదే నా జీవితంలో ప్రధాన లక్ష్యమని మహి ప్రకటించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..