Yuzvendra Chahal-Dhanashree: ‘ఔను.. మేం విడిపోయాం’.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న చాహల్- ధనశ్రీ

అంతా ఊహించినట్లే జరిగింది. గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. చాహల్, ధనశ్రీ వర్మలది ప్రేమ వివాహం. వీరు 2020లో వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు.

Yuzvendra Chahal-Dhanashree: ఔను.. మేం విడిపోయాం.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న చాహల్- ధనశ్రీ
Yuzvendra Chahal, Dhanashre

Updated on: Feb 21, 2025 | 8:55 AM

యుజువేంద్ర చాహల్, ధన శ్రీ వర్మలు అధికారికంగా విడిపోయారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 21) ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు చాహల్‌, ధనశ్రీ హాజరయ్యారు. మొదట ఈ ఇద్దరికి 45నిమిషాల పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చిన జడ్జి విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ‘ఇప్పటికీ మీరు విడిపోవాలని అనుకుంటున్నారా? అని అడగ్గా, చాహల్, ధనశ్రీ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్లు వెల్లడించారు. దీంతో జడ్జి చాహల్- ధనశ్రీల విడాకులకు ఆమోదం తెలిపారు. కాగా విడాకులను ధ్రువీకరిస్తూ ధన శ్రీ వర్మ సోషల్ మీడియాలో ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేసింది. ‘మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొంతకాలంగా తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే.. మీకు మరో అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. బాధలన్నీ మర్చిపోయి దేవుడిని మనసారా ప్రార్థించండి. భగవంతుడిపై మీకున్న నమ్మకం, విశ్వాసమే మీకంతా మంచి జరిగేలా చేస్తుంది’ అని ధనశ్రీ రాసుకొచ్చింది. దీనికి ‘ఫ్రం స్ట్రెస్డ్ టు బ్లెస్డ్ (ఒత్తిడి నుంచి ఆశీర్వాదం’ అని అని క్యాప్షన్‌ పెట్టింది.

కాగా సుమారు 18 నెలల నుంచి చాహల్, ధనశ్రీలు వేర్వేరుగా ఉన్నారని జడ్జి తెలిపారు. కొన్ని నెలల క్రితం, చాహల్, ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత క్రికెటర్ తన భార్యతో ఉన్న అన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాడు. ఆ తర్వాత ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పేరు నుంచి ‘చాహల్’ ను తొలగించింది. ఇక విడాకుల వార్తలకు బలం చేకురుస్తూ యుజ్వేంద్ర చాహల్ ఒక పోస్ట్‌లో ‘కొత్త జీవితం లోడింగ్’ అని పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు చాహల్, ధన శ్రీ

ఇవి కూడా చదవండి

పరస్పర అంగీకారంతోనే..

చాహల్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.