IND vs SL: 7 వరుస విజయాలతో రోహిత్ సేన సంచలనం.. వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డ్..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో సెమీఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా అవతరించింది. మెన్ ఇన్ బ్లూ టోర్నమెంట్‌లో వరుసగా ఏడవ విజయాన్ని నమోదు చేసింది. ఈ ప్రక్రియలో దక్షిణాఫ్రికాను అధిగమించి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

IND vs SL: 7 వరుస విజయాలతో రోహిత్ సేన సంచలనం.. వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డ్..
Team India

Updated on: Nov 02, 2023 | 9:09 PM

ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో సెమీఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా అవతరించింది.

మెన్ ఇన్ బ్లూ టోర్నమెంట్‌లో వరుసగా ఏడవ విజయాన్ని నమోదు చేసింది. ఈ ప్రక్రియలో దక్షిణాఫ్రికాను అధిగమించి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు చేయడంతో శ్రీలంక కేవలం 55 పరుగులకే ఆలౌటైంది.