AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket Team: మరో వివాదంలో బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్ల ఆహారంపై నెట్టింట్లో దుమారం.. అసలేమైందంటే?

BCCI: భారత క్రికెట్ జట్టు కోసం బీసీసీఐ సరికొత్త డైట్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈమేరకు బీసీసీఐ డైట్ ప్లాన్ నెట్టింట్లో దుమారం రేగుతోంది.

Indian Cricket Team: మరో వివాదంలో బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్ల ఆహారంపై నెట్టింట్లో దుమారం.. అసలేమైందంటే?
Ind Vs Nz
Venkata Chari
|

Updated on: Nov 23, 2021 | 1:55 PM

Share

Indian Cricket Team Diet Plan: భారత క్రికెట్ జట్టు కొత్త డైట్ ప్లాన్‌పై దుమారం రేగుతోంది. టీం ఇండియా క్రికెటర్లు హలాలా సర్టిఫైడ్ మాంసాన్ని మాత్రమే తినాలని బీసీసీఐ తప్పనిసరి చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. #BCCI_Promotes_Halal పేరుతో ట్విటర్‌లో ట్రెండ్ నడుస్తోంది. అందులో భారత క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి రెండు రోజుల క్రితం భారత క్రికెట్ జట్టు కోసం బీసీసీఐ కొత్త డైట్ ప్లాన్ సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి. క్రికెటర్లు ఈ ప్రణాళికను కచ్చితంగా పాటించాలంటూ అందులో పేర్కొంది. హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తినమని పేర్కొన్నట్లు వార్తుల వెలువడ్డాయి.

స్పోర్ట్స్ టాక్ వెబ్‌సైట్ ప్రకారం, ఆటగాళ్లు కొన్ని రకాల మాంసాలను తినేందుకు అనుమతి లేదు. వారి ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు. ఎవరైనా మాంసం తినాలనుకుంటే, హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తినాలి. ఇది కాకుండా, మీరు ఇతర రకాల మాంసం తినకూడదు. రాబోయే క్రికెట్ క్యాలెండర్ మేరకు చాలా పెద్ద సిరీస్‌లు ఆడాలని, అందుకే ఆటగాళ్లను ఫిట్‌గా ఉంచడానికి ఈ డైట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆటగాళ్ల బరువు పెరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు.

బయో బబుల్‌లో ఉండటం వల్ల కొంత మంది ఆటగాళ్లు నిరంతరం క్రికెట్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు. అన్ని ఫార్మాట్లలో తమ ఎనర్జీని నిలబెట్టుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐ కోరింది. మాంసాహారాన్ని ఇష్టపడి రోజూ తినే క్రీడాకారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది.

బీసీసీఐ సోషల్ మీడియాలో హలాల్ సర్టిఫైడ్ ఫుడ్‌ను ప్రచారం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ, హిందూత్వ సంస్థలతో అనుబంధంగా ఉన్న ట్విట్టర్ ఖాతాల నుంచి నిత్యం దీనిపై ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో బీసీసీఐని అలా చేయవద్దని కోరుతున్నారు. దీనితో పాటు, హిందూ, సిక్కు క్రికెటర్లను హలాల్ మాంసం తినమని ఎందుకు బలవంతం చేస్తున్నారని ప్రశ్నించారు.

నిజానికి హలాల్ మాంసాన్ని హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ ద్వారా ఇస్లామిక్ చట్టానికి ప్రాధాన్యత ఇస్తున్నామంటూ తీవ్ర పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటు హిందూ, సిక్కు మతాల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని, చాలా మంది హిందువులు, సిక్కులు హలాల్ మాంసాన్ని తినరంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇస్లాంలో హలాల్ కాకుండా ఇతర మార్గాల్లో తయారుచేసిన మాంసాన్ని తినడంపై నిషేధం ఉంది. దీంతో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే బీసీసీఐ రంగంలోకి దిగాల్సిందే.

Also Read: SMAT 2021: ధోని చెప్పిన టిప్స్‌తోనే ఆఖరి బంతికి సిక్స్ కొట్టా.. ఫినిషింగ్ మనదైతే ఆ కిక్కే వేరేలా ఉంటది: షారూఖ్ ఖాన్

India vs New Zealand, 1st Test: బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేసిన ద్రవిడ్-రహానే.. ఎక్కడికి వెళ్లారంటే?