SMAT 2021: ధోని చెప్పిన టిప్స్‌తోనే ఆఖరి బంతికి సిక్స్ కొట్టా.. ఫినిషింగ్ మనదైతే ఆ కిక్కే వేరేలా ఉంటది: షారూఖ్ ఖాన్

Shahrukh Khan: ఈ ఆటగాడు బ్యాటింగ్‌కి వచ్చేసరికి జట్టు 28 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. ఇతర బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఒత్తిడిని ఎదుర్కొగా, ఈ ఆటగాడు మాత్రం చివరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

SMAT 2021: ధోని చెప్పిన టిప్స్‌తోనే ఆఖరి బంతికి సిక్స్ కొట్టా.. ఫినిషింగ్ మనదైతే ఆ కిక్కే వేరేలా ఉంటది: షారూఖ్ ఖాన్
Shahrukh Khan Syed Mushtaq Ali Trophy
Follow us

|

Updated on: Nov 23, 2021 | 1:04 PM

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 టైటిల్‌ను తమిళనాడు వరుసగా రెండోసారి గెలుచుకుంది. ఫైనల్లో కర్ణాటకపై విజయం సాధించింది. తమిళనాడు విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆర్ సాయి కిషోర్, బ్యాట్స్‌మెన్ షారుక్ ఖాన్. సాయి కిషోర్ బౌలింగ్‌లో అద్భుతాలు చేస్తూ మూడు వికెట్లు తీసి కర్ణాటకను పెద్ద స్కోరు చేయనివ్వలేదు. దీంతో తమిళనాడుకు 152 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక నిర్దేశించింది. చివరి ఓవర్‌లో ఫినిషర్‌గా నటించిన షారుక్ ఖాన్ టైటిల్‌ను తమిళనాడు బ్యాగ్‌లో వేశాడు. 15 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అతను బ్యాటింగ్‌కు వచ్చేసరికి తమిళనాడు జట్టు 28 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. మిగతా బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఒత్తిడిలో కూరుకపోయారు. షారుక్ ఖాన్ మాత్రం ప్రశాంతంగా బ్యాటింగ్ చేసి చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. షారుక్ ఖాన్ తన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉందని చెప్పాడు. తమిళనాడు టాప్ ఆర్డర్ బాగా బ్యాటింగ్ చేయడంతో లక్ష్యాన్ని ఛేదించిందని అన్నాడు.

‘నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు, ఆ పిచ్‌పై స్కోర్ చేయడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. రెండు బంతులు ఆడిన తర్వాత, మా కుర్రాళ్లు (టాప్ ఆర్డర్) మంచి పని చేశారని నాకు అనిపించింది. అవును, రన్ రేట్ నెమ్మదిగా ఉంది. కానీ, వారు భాగస్వామ్యం అందించకపోతే నేను మ్యాచ్‌ని ముగించలేకపోయేవాడిని. నా కలను నిజయం చేసేందుకు రెండు బంతులే ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్లు వస్తారని నాకు తెలుసు. పూర్తి చేస్తానన్న నమ్మకంతో మ్యాచ్‌ని చివరి వరకు తీసుకెళ్లాలని ప్లాన్‌ చేశాం’ అని షారుక్ ఖాన్ పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ ముగిసే వరకు ఒత్తిడికి లోనవ్వకుండా ఆడడంతోనే విజయం సాధ్యమైంది.

ధోనీ చిట్కాలతోనే సాధ్యమైంది.. తమిళనాడు చివరి ఏడు బంతుల్లో విజయానికి 22 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్ చివరి బంతికి షారూఖ్ ఖాన్ సిక్సర్ బాదాడు. దీంతో చివరి ఓవర్‌లో 16 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. దీని తర్వాత, చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా, షారుక్ సిక్సర్ కొట్టాడు. ఐపీఎల్ సమయంలో ఎంఎస్ ధోనీ నుంచి షారుక్ చిట్కాలు కూడా అందుకున్నాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘ఫినిషర్ పాత్ర గురించి నాకు స్పష్టంగా వివరించి, మీరు ఏది చేసినా దానిపై పూర్తి నమ్మకం ఉంచండి అని అన్నారు. ఎందుకంటే ఆ సమయంలో మీరు పరిస్థితిని ఉత్తమంగా అంచనా వేయగలరు. లక్ష్యాన్ని వెంబడిస్తున్నప్పుడు మీ మనస్సులో ఏమి జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు’ అని ధోని చెప్పాడని తెలిపాడు. అలగే ఫినిషర్ పాత్ర చాలా కష్టంతో కూడుకుంది. ఇలాంటి టైంలో ఒత్తిడికి చిత్తయితే, మంచి క్రికెటర్ అవ్వలేమని గట్టిగా నమ్మాను, దాంతోనే విజయం సాధ్యమైంది అని పేర్కొన్నాడు.

Also Read: India vs New Zealand, 1st Test: బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేసిన ద్రవిడ్-రహానే.. ఎక్కడికి వెళ్లారంటే?

IND vs NZ, 1st Test: తొలి టెస్టులో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేది ఎవరు? రహానె-ద్రవిడ్‌ చూపులో ఉన్నది వారేనా..!

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు