Ind vs Pak: భారత్ కచ్చితంగా పాకిస్తాన్‌ వెళ్తుంది.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతుంది: ఐసీసీ ఛైర్మన్

2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరుగుతుందని ఐసీసీ పేర్కొంది. అయితే ఈ ఈవెంట్‌లో టీమిండియా పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలా సంవత్సరాల తరువాత..

Ind vs Pak: భారత్ కచ్చితంగా పాకిస్తాన్‌ వెళ్తుంది.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతుంది: ఐసీసీ ఛైర్మన్
India Vs Pakistan
Follow us
Venkata Chari

|

Updated on: Nov 23, 2021 | 1:59 PM

2025 Champions Trophy: 2031 వరకు ఐసీసీ ఈవెంట్లకు ఏఏ దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయో రెండు వారాల క్రితమే ఓ జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ ఈవెంట్‌లో టీమిండియా పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలా సంవత్సరాల తరువాత(1996లో చివరి సారి పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది) పాకిస్తాన్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దాయాది దేశాలు చాలా ఏళ్లుగా కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే ఢీకొట్టుకుంటున్నాయి. పాకిస్తాన్‌లో నిర్వహించేది కూడా ఐసీసీ ఈవెంట్‌ కాబట్టి భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో తెలియదు. ఇప్పటికీ పలు భద్రత కారణాలను చూపిస్తూ పాకిస్తాన్ వెళ్లాలంటే ఇతర దేశాల ఆటగాళ్లు వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే విషయమై తాజాగా ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘1996 తరువాత పాకిస్థాన్ దేశంలో ఐసీసీ ఈవెంట్ జరగబోతోంది. కొన్ని కారణాలతో అక్కడ ఎలాంటి ఈవెంట్లు జరగడం లేదు. ఈ పరిస్థికి ముందు పాకిస్తాన్‌లోనూ పలు ఐసీసీ ఈవెంట్లు జరిగాయి’ అని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ మధ్య ఇదే విషయంపై బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. మా చేతుల్లో ఏంలేదు. ఇరు దేశాల ప్రభుత్వాలే ఓ నిర్ణయం తీసుకోవాలంటూ తేల్చేశారు. భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా అక్కడికి వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అయితే పాకిస్థాన్‌లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ వెళ్లే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌కు అని దేశాల టీంలు తప్పక వస్తాయని, టీమిండియా కూడా ఈ ఈవెంట్‌లో కచ్చితంగా ఆడుతుందని, ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆటలు కూడా సహాయపడగలవు. ముఖ్యంగా క్రికెట్‌ కూడా తనవంతు పాత్ర పోషించగలదు’ అని బార్క్లే పేర్కొన్నారు. 2025లో పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై అవసరమైనప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటామని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదివరకే తేల్చిచెప్పారు. మరి ఐసీసీ నిర్ణయానికి భారత ప్రభుత్వం ఓకే చెబుతుందా లేదా అని త్వరలోనే తెలియనుంది.

Also Read: Indian Cricket Team: మరో వివాదంలో బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్ల ఆహారంపై నెట్టింట్లో దుమారం.. అసలేమైందంటే?

SMAT 2021: ధోని చెప్పిన టిప్స్‌తోనే ఆఖరి బంతికి సిక్స్ కొట్టా.. ఫినిషింగ్ మనదైతే ఆ కిక్కే వేరేలా ఉంటది: షారూఖ్ ఖాన్