
Asia Cup 2023 India vs Sri Lanka Super Fours: ఆసియా కప్ 2023లో సూపర్-4 దశ నాలుగో మ్యాచ్ ఈరోజు భారత్-శ్రీలంక మధ్య జరుగుతోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో లంక తొలుత బౌలింగ్ చేయనుంది. కాగా, టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి శార్దుల్ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. గాయం కారణంగా పాక్‌తో జరిగిన ప్లేయింగ్ ఎలెవన్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్ నేటి మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. శ్రేయాస్ అయ్యర్ మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాడని, అతని గాయం గురించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది.
కొలంబోలో వాతావరణం..
కొలంబోలో ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. కానీ, ఇప్పుడు వాతావరణం స్పష్టంగా ఉంది. అనుకున్న సమయానికి ఆట ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఆసియా కప్‌లో వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్లు 20వ సారి తలపడనున్నాయి. ఇరుజట్లు చివరిసారిగా 2014లో తలపడ్డారు.
సూపర్-4 దశలో భారత్‌కు ఇది రెండో మ్యాచ్. సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 228 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక జట్టు సూపర్-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. అయితే, ఇరుజట్లకు ఇది కీలక మ్యాచ్. విజయం సాధించిన టీం ఫైనల్ చేరతాయి.
భారత్, శ్రీలంక మధ్య 165 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 96 మ్యాచ్‌లు, శ్రీలంక 57 మ్యాచ్‌లు గెలిచాయి. 11 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టై అయింది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..