AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన భారత్.. బరిలోకి కొత్త ప్లేయర్.. ఎవరంటే?

India vs West Indies, 2nd ODI Toss Update: వెస్టిండీస్‌తో జరిగిన గత 12 వన్డేలలో భారత్ 11 గెలవగా, వెస్టిండీస్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 143 వన్డేలు జరిగాయి. భారత్ 73 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 64 మ్యాచ్‌లు గెలిచింది.

IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన భారత్.. బరిలోకి కొత్త ప్లేయర్.. ఎవరంటే?
India Vs West Indies, 2nd Odi Toss Update
Venkata Chari
|

Updated on: Sep 30, 2026 | 1:39 PM

Share

India vs West Indies, 2nd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లోని రెండో మ్యాచ్ నేడు గౌహతిలో మొదలైంది. ఈమేరకు టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈక్రమంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ పిచ్ పరిస్థితులపై స్పందించాడు. “మేము మొదట బౌలింగ్ చేయబోతున్నాము. పిచ్ కొంచెం కఠినంగా, అక్కడక్కడా ప్యాచ్‌లుగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో మా జట్టు పుంజుకున్న తీరు ఎంతో సంతృప్తినిచ్చింది. సాయంత్రం వేళల్లో ఇక్కడ తేమ (dew) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి మా బౌలర్లకు ఇది మంచి సవాలుగా మారుతుంది. రోహిత్‌తో సహా జట్టులోని ఆటగాళ్లందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగిందని, నితీష్ స్థానంలో నబీ నేడు అరంగేట్రం (Debut) చేస్తున్నాడు” అని గిల్ వెల్లడించాడు.

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకున్నట్లు తెలిపాడు. “టాస్ గెలిచే అవకాశాలు 50-50 శాతం ఉన్నాయి. పిచ్ చాలా బాగుంది, మేము గతంలో కంటే మెరుగ్గా రాణించడానికి ఇది మరో చక్కటి అవకాశం. జట్టులో కొన్ని అంశాలపై దృష్టి పెట్టి మెరుగుపరచుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మేము నాలుగు మార్పులతో బరిలోకి దిగుతున్నాం” అని వెల్లడించాడు.

ఎక్కువమంది చదివినది: Team India: వన్డేల్లో నేను, టీ20ల్లో నువ్వు.. ట్యాలెంట్ ఉన్నా బెంచ్‌కే రా తమ్ముడూ..!

ఇవి కూడా చదవండి

పిచ్ స్వభావం దృష్ట్యా సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సులువు అవుతుందని భావిస్తున్న తరుణంలో, టీమిండియా బౌలర్లు ఏ విధంగా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఓపెనర్ రోహిత్ శర్మ 12,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 73 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మైలురాయిని చేరుకుంటే, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ భారత బ్యాట్స్‌మన్‌గా అతను నిలుస్తాడు.

తిరువనంతపురంలో జరిగిన సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, విరాట్ కోహ్లీ వన్డేలలో అత్యంత వేగంగా 15,000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

2018లో ఈ మైదానంలోనే రోహిత్, కోహ్లీ సెంచరీలు..

గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం 2018లో జరిగిన భారత్-వెస్ట్ ఇండీస్ వన్డేతో సహా రెండు వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది. వెస్టిండీస్ 323 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా, రోహిత్, కోహ్లీల శతకాల పుణ్యమా అని భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ 117 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేయగా, కోహ్లీ 107 బంతుల్లో 140 పరుగులు చేశాడు.

కుల్దీప్ 200 వన్డే వికెట్లకు రెండు అడుగుల దూరంలో..

కుల్దీప్ యాదవ్ 200 వన్డే వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనతను సాధిస్తే, అతను 200 వన్డే వికెట్లు సాధించిన తొమ్మిదవ భారత బౌలర్‌గా నిలుస్తాడు. వన్డేలలో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. అతను 269 మ్యాచ్‌లలో 334 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో, రవీంద్ర జడేజా (232 వికెట్లు) మరియు మహమ్మద్ షమీ (206 వికెట్లు) కుల్దీప్ కంటే ముందున్నారు.

ఎక్కువమంది చదివినది: రోహిత్ @ 73.. కోహ్లీ @ 100.. గౌహతీలో అరుదైన రికార్డులపై కన్నేసిన రోకో..!

గత 12 వన్డేలలో భారత్ కేవలం ఒక మ్యాచ్‌లోనే ఓటమి..

వెస్టిండీస్‌తో జరిగిన గత 12 వన్డేలలో భారత్ 11 గెలవగా, వెస్టిండీస్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 143 వన్డేలు జరిగాయి. భారత్ 73 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 64 మ్యాచ్‌లు గెలిచింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (సి), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (w), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us