IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కి సిద్ధమైన టీమిండియా.. రేపటి నుంచే.. పూర్తి షెడ్యూల్ ఇదే..

|

Dec 05, 2023 | 12:33 PM

England Women Tour Of India Women: ఇండియా - ఇంగ్లాండ్ మహిళల సిరీస్ ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం నుంచి మొదలుకానుంది. భారత గడ్డపై 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌, భారత్‌లు 4 రోజుల టెస్టు మ్యాచ్‌లోనూ తలపడనున్నాయి. మూడు టీ20ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించగా, హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కి సిద్ధమైన టీమిండియా.. రేపటి నుంచే.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Indw Vs Engw
Follow us on

స్వదేశంలో జరిగే సిరీస్‌కు భారత మహిళా క్రికెట్ జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్-ఇంగ్లాండ్ (India Women vs England Women) మహిళల జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల T20I సిరీస్, ఒక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ డిసెంబర్ 6న ప్రారంభమై డిసెంబర్ 17న ముగుస్తుంది. భారత గడ్డపై 18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌, భారత్‌లు 4 రోజుల టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాబోయే సిరీస్‌ల షెడ్యూల్, సమయం, జట్టు వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో భారత్-ఇంగ్లండ్ మహిళల సిరీస్ జరగనుంది. మూడు టీ20ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించగా, హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జట్టులో సైకా ఇషాక్, టిటాస్ సాధు, రాంకా పాటిల్‌తో సహా యువ ప్రతిభ ఉంది. టెస్టు మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు నాయకత్వం వహిస్తుంది.

భారత్ vs ఇంగ్లండ్ మహిళల సిరీస్ షెడ్యూల్:

టీ20 సిరీస్:

1వ T20I: డిసెంబర్ 6 – వాంఖడే స్టేడియం, ముంబై, రాత్రి 7 గంటలకు

ఇవి కూడా చదవండి

2వ T20I: డిసెంబర్ 9 – వాంఖడే స్టేడియం, ముంబై, రాత్రి 7 గంటలకు

3వ T20I: డిసెంబర్ 10 – వాంఖడే స్టేడియం, ముంబై, రాత్రి 7 గంటలకు

ఒకే ఒక టెస్ట్..

డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 17 వరకు – డీవై పాటిల్ స్టేడియం, ఉదయం 9:30 గంటలకు

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఉమెన్ సిరీస్ 2023 జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కోసం అందుబాటులో ఉంటుంది. ఈ మ్యాచ్‌లు భారతదేశంలో స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రసారం కానున్నాయి.

టీ20 సిరీస్ కోసం జట్లు:

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాంకా పాటిల్, మన్నత్ కశ్యక్, సయికా ఇషాక్ , రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి.

ఇంగ్లండ్ మహిళల జట్టు: లారెన్ బెల్, మాయా బౌచియర్, అలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, మహికా గౌర్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, హీథర్ నైట్ (కెప్టెన్), నాట్ సైవర్-బ్రంట్, డేనియల్ వ్యాట్.

టెస్ట్ మ్యాచ్ కోసం జట్లు:

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, శుభా సతీష్, హర్లీన్ డియోల్ , రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్.

ఇంగ్లండ్ మహిళల జట్టు: టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, బెస్ హీత్, అమీ జోన్స్, హీథర్ నైట్ (కెప్టెన్), ఎమ్మా లాంబ్, నాట్ స్కివర్-బ్రంట్, డేనియల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..