India vs UAE: కుల్దీప్, దూబేల మాయాజాలం.. 57 పరుగులకే యూఏఈ ఆలౌట్..

India vs UAE, Asia Cup 2025: ఆసియా కప్‌లో తన తొలి మ్యాచ్‌లో భారత్ 13.1 ఓవర్లలో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. టీ20 క్రికెట్‌లో భారత్‌పై ఏ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు ఇది. అలాగే, ఈ ఫార్మాట్‌లో యూఏఈకి ఇదే అత్యల్ప స్కోరు.

India vs UAE: కుల్దీప్, దూబేల మాయాజాలం.. 57 పరుగులకే యూఏఈ ఆలౌట్..
Ind Vs Uae

Updated on: Sep 10, 2025 | 9:26 PM

India vs UAE, Asia Cup 2025: ఆసియా కప్‌లో తన తొలి మ్యాచ్‌లో భారత్ 13.1 ఓవర్లలో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. టీ20 క్రికెట్‌లో భారత్‌పై ఏ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు ఇది. అలాగే, ఈ ఫార్మాట్‌లో యూఏఈకి ఇదే అత్యల్ప స్కోరు.

బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. యుఏఈ చివరి 8 వికెట్లను 28 పరుగులకే కోల్పోయింది. ఓపెనర్ అలీషాన్ షరాఫు 22 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మద్ వసీం 19 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ రెండంకెల మార్కును దాటలేకపోయారు. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. శివమ్ దుబే 3 వికెట్లు పడగొట్టాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్- అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు వరుణ్ చక్రవర్తి.

ఇవి కూడా చదవండి

యూఏఈ- మహ్మద్ వసీం (కెప్టెన్) , అలీషాన్ షరాఫు, రాహుల్ చోప్రా, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, మహ్మద్ జోహెబ్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖీ, మహ్మద్ రోహిద్, సిమర్జిత్ సింగ్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us