ఈ ఆటగాడి సూపర్ ఇన్నింగ్స్‌తో శ్రీలంకకు వణుకు పుట్టించాడు.. 304 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా
India vs Sri Lanka: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా వన్డే సిరీస్‌ను 2-1తో ఇప్పటికే గెలుచుకున్న సంగతి తెలిసందే.
On This Day In Cricket: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా వన్డే సిరీస్‌ను 2-1తో ఇప్పటికే గెలుచుకున్న సంగతి తెలిసందే. నేడు చివరి టీ 20 మ్యాచులో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. అయితే, మూడు టీ20ల సిరీస్‌లో శిఖర్ ధావన్ సేన శ్రీలంకతో కలిసి సమంగా నిలిచింది. నేడు జరిగే మూడో టీ20లో ఎవరు విజయం సాధిస్తే.. వారిదే టీ20 సిరీస్. వాస్తవానికి, శ్రీలంక జట్టు మహేలా జయవర్ధనే, కుమార్ సంగక్కర వంటి ఆటగాళ్ల టైంలో ఉన్నంత బలంగా లేదు. ఆటైంలో గాలెలో జరిగిన ఓ మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను ఓడించింది. జులై 29 న, ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో శిఖర్ ధావన్ 190 పరుగులు చేసి, టీమిండియా 304 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్, శ్రీలంక (ఇండియా వర్సెస్ శ్రీలంక) మధ్య జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ 2017 లో జులై 26 నుంచి 29 వరకు జరిగింది. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 600 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 168 బంతుల్లో 190 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆయనతో పాటు ఛతేశ్వర పుజరా 152 పరుగులు అందించాడు. వీరితోపాటు అజింక్య రహానె 57, హార్దిక్ పాండ్యా 50 పరుగులతో రాణించారు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా 47 పరుగులు సాధించాడు. మహమ్మద్ షమీ మూడు సిక్సర్ల సహాయంతో 30 బంతుల్లో 30 పరుగులు చేశాడు. శ్రీలంక తరపున నువాన్ ప్రదీప్ 6, లాహిరు కుమార 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 291 పరుగులు చేసింది. ఇందులో దిల్‌రూవాన్ పెరెరా అజేయంగా 92 పరుగులు చేయగా, ఏంజెలో మాథ్యూస్ 83, ఉపుల్ తరంగా 64 పరుగులు సాధించారు. రవీంద్ర జడేజా 3, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు.
విరాట్ కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్.. ఫాలో ఆన్‌లో పడ్డ శ్రీలంక జట్టును ఆడించకుండా టీమిండియాను బరిలోకి దిగింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులకు డిక్లేర్ చేసింది. ఈసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయంగా 103 పరుగులు చేయగా, అభినవ్ ముకుంద్ 81 పరుగులు సాధించాడు. శ్రీలంకకు 550 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈసారి ఆతిథ్య జట్టు కేవలం 245 పరుగులకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో గెలిచింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో కరుణరత్నే 97 పరుగులు చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ నిరోషన్ డిక్వెల్లా 67 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చారు.
IND Vs SL: మైదానంలోకి చిట్టీ పంపిన రాహుల్ ద్రవిడ్.. అందులో ఏముందంటూ నెటిజన్ల కామెంట్లు..!