భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో స్పిన్ వలలో చిక్కిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. 100 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి.. సౌతాఫ్రికా పాటిల యముడిలా మారాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, సుందర్ 2, సిరాజ్ 2, అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.
సౌతాఫ్రికా వికెట్ల పతనం..
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ పెద్దగా రాణించలేకపోయాడు. అతడిని వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. డికాక్ బ్యాట్‌కు 10 బంతుల్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఫ్రికన్ జట్టుకు మహ్మద్ సిరాజ్ రెండో దెబ్బ తీశాడు. అతను 15 పరుగులు చేసిన తర్వాత యనెమాన్ మలన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రీజా హెండ్రిక్స్ వికెట్ కూడా మహ్మద్ సిరాజ్ తీశాడు. 21 బంతుల్లో 3 పరుగులు చేశాడు. మార్క్రామ్ వికెట్‌ను షాబాజ్ అహ్మద్ తీశాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేశాడు. అదే సమయంలో పూర్తిగా సెట్ అయిన క్లాసెన్ 34 పరుగులు చేసి షాబాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ మిల్లర్‌ను వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ చేశాడు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ ఆండిలె ఫెహ్లుక్వాయో వికెట్ పడగొట్టాడు.
ODIలలో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోర్లు..
69 vs ఆస్ట్రేలియా, సిడ్నీ 1993
83 vs ఇంగ్లండ్, నాటింగ్‌హామ్ 2008
83 vs ఇంగ్లండ్, మాంచెస్టర్ 2022
99 vs భారత్, ఢిల్లీ 2022
117 vs భారత్, నైరోబీలో 1999
Innings Break!
Superb bowling peformance from #TeamIndia! ? ?
4⃣ wickets for @imkuldeep18
2⃣ wickets each for Shahbaz Ahmed, @mdsirajofficial & @Sundarwashi5Over to our batters now. ? ?
Scorecard ? https://t.co/XyFdjV9BTC #INDvSA pic.twitter.com/B2wUzvis4y
— BCCI (@BCCI) October 11, 2022
ఇరు జట్ల ప్లేయింగ్ XI..
టీమ్ ఇండియా: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (కీపర్), యెనెమన్ మలన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), మార్కో జాన్సన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, జార్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్‌గిడి, ఎన్రిక్ నోర్త్యా.