భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుకు డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా టీం కష్టాల్లో కూరుకపోయింది. 19.4 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్రికా జట్టు స్కోరు 72 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ 22, మార్కో జాన్సెన్ ఉన్నారు.
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ పెద్దగా రాణించలేకపోయాడు. అతడిని వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. డికాక్ బ్యాట్‌కు 10 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్రికన్ జట్టుకు మహ్మద్ సిరాజ్ రెండో దెబ్బ రుచి చూపించాడు. అతను 15 పరుగులు చేసిన తర్వాత యనెమాన్ మలన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మార్ర్కామ్ వికెట్ కూడా పడగొట్టాడు. మార్క్రామ్ బ్యాట్ నుంచి 8 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. ఇక భారత బౌలర్లలో సుందర్ 2, సిరాజ్ 2, అహ్మద్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇరు జట్ల ప్లేయింగ్ XI..
టీమ్ ఇండియా: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (కీపర్), యెనెమన్ మలన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), మార్కో జాన్సన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, జార్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్‌గిడి, ఎన్రిక్ నోర్త్యా.
T. I. M. B. E. R!
Second wicket for @Sundarwashi5 as he castles David Miller. ? ?
Follow the match ? https://t.co/XyFdjV9BTC #TeamIndia | #INDvSA pic.twitter.com/s1HjHwQ2um
— BCCI (@BCCI) October 11, 2022
12 ఏళ్ల తర్వాత సిరీస్‌ను గెలుచుకునే అవకాశం..
2010 నుంచి భారత జట్టు తన గడ్డపై దక్షిణాఫ్రికాపై ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఆ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో 2015లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 3-2 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో 12 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా తర్వాత సిరీస్ గెలిచే అవకాశం శిఖర్ సేనకు దక్కనుంది.