
ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోటీ – భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. హెడ్-టు-హెడ్ గణాంకాలలో ప్రపంచ కప్‌ల విషయానికి వస్తే, వన్డే ఫార్మాట్‌లో భారత్ 8-0 ఆధిక్యంలో ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే, పాకిస్తాన్ తమ చిరకాల ప్రత్యర్థులపై మెరుగైన రికార్డును కలిగి ఉంది.
ఈ మినీ వరల్డ్ కప్‌లో పాక్ 3-2 ఆధిక్యంలో ఉంది. 2017 ఫైనల్లో పాకిస్తాన్ భారత్‌ను 180 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు ఫిబ్రవరి 23న మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్ సెమీఫైనల్ అవకాశాలను బలపరచుకోవాలని చూస్తుండగా, పాకిస్తాన్ నాక్‌ఔట్ దశకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి.
ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో, పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంజమామ్-ఉల్-హక్, మహమ్మద్ యూసుఫ్ తమ అజేయ భాగస్వామ్యంతో కీలకపాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ (128), మహమ్మద్ యూసుఫ్ (87) అద్భుతమైన బ్యాటింగ్ చేసి పాక్ 302 పరుగులు చేసింది. భారత్ గంభీర్, ద్రవిడ్ అర్ధ సెంచరీలు చేసినప్పటికీ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈసారి భారత్ తన గెలుపు ఖాతా తెరిచింది. పాక్ 165 పరుగులకే ఆలౌట్ కాగా, వర్షం కారణంగా లక్ష్యం 102 పరుగులకు కుదించబడింది. శిఖర్ ధావన్ (48), విరాట్ కోహ్లీ (22) రాణించడంతో భారత్ సులభంగా గెలిచింది.
భారత్ గ్రూప్ దశలో పాక్‌ను చిత్తుగా ఓడించింది. రోహిత్ శర్మ (91), ధావన్ (68), కోహ్లీ (81), యువరాజ్ (53) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 319/3 స్కోరు సాధించింది. బుమ్రా, భువనేశ్వర్, పాండ్యా సమిష్టిగా బౌలింగ్ చేయడంతో పాక్ 164 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌ను భారత్ ఫేవరెట్‌గా ప్రారంభించినప్పటికీ, ఫఖర్ జమాన్ (114) శతకంతో పాక్ 338/4 భారీ స్కోరు చేసింది. మహ్మద్ అమీర్ అద్భుతమైన బౌలింగ్ (3/16) చేసి భారత్‌ను 158 పరుగులకే ఆలౌట్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఒంటరి పోరాటం (76) చేసినప్పటికీ, భారత్ 180 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఫిబ్రవరి 23న జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ మరోసారి తమ ఆధిక్యతను నిరూపించుకోవాలనుకుంటుంది. రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్, షమీ వంటి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించనున్నారు.ఇటు వైపు, పాకిస్తాన్ గాయాల సమస్యతో సతమతమవుతోంది. బాబర్ అజామ్ నెమ్మదిగా ఆడటంపై విమర్శలు వస్తుండగా, ఫఖర్ జమాన్ గాయంతో దూరమయ్యాడు. పాక్ పేస్ త్రయం – షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్, నసీమ్ షా తమ బలాన్ని నిరూపించుకోవాలి.
ఈ మ్యాచ్ విజేత సెమీఫైనల్ అవకాశాలను బలపరచుకుంటుంది. కానీ ఓడిపోయిన జట్టుకు టోర్నమెంట్‌లో కొనసాగడానికి చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారత్ – పాక్ మ్యాచ్ ఎప్పుడూ క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠలో ఉంచే పోటీ. మరి ఫిబ్రవరి 23న ఏ జట్టు గెలుస్తుందో చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..