IND vs PAK: నిమిషాల్లోనే అమ్ముడైన భారత్-పాక్ టిక్కెట్లు.. బుక్‌మైషో సంస్థను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..

India vs Pakistan World Cup 2023: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సర్వర్ డౌన్ అయింది. దీంతో కొందరు అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేయలేకపోయారు. ఆన్‌లైన్‌లో గంటల తరబడి వేచి ఉండి టికెట్‌ కొనుగోలు చేసినా సర్వర్‌ పనిచేయకపోవడంతో టిక్కెట్లు కొనుగోలు చేయలేకపోయారు.

IND vs PAK: నిమిషాల్లోనే అమ్ముడైన భారత్-పాక్ టిక్కెట్లు.. బుక్‌మైషో సంస్థను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..
India Vs Pakistan Tickets

Updated on: Aug 30, 2023 | 8:28 AM

ఆసియా కప్ 2023 (Asia Cup 2023) నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ (Pakistan vs Nepal) జట్లు తలపడుతున్నాయి. అయితే, ఆసియా కప్‌లోకు అసలైన పోరు భారత్-పాకిస్థాన్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ మైదాన్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. వాస్తవానికి, వన్డే ప్రపంచ కప్ (ICC World Cup 2023) అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఈ దాయాదుల క్రికెట్ యుద్ధంలో భారతదేశం-పాక్ జట్లు అక్టోబర్ 14 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ గ్రౌండ్‌లో తలపడనున్నాయి. కాబట్టి ఈ చిరకాల ప్రత్యర్థుల పోరాటాన్ని చూసేందుకు లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వరల్డ్ కప్ టిక్కెట్ల విక్రయించే, బుక్ మై షో సంస్థ పేలవ పనితీరుతో క్రికెట్ అభిమానులు ఆ సంస్థను తిట్టిపోస్తున్నారు.

టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి..

అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు నిన్న ఆగస్టు 29 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ బుక్ మై షో ప్రకటించింది. ఈ హై వోల్టేజ్ యుద్ధాన్ని చూసేందుకు లక్షలాది మంది అభిమానులు టిక్కెట్లు కొనడానికి వేచి ఉన్నారు. అయితే టిక్కెట్‌ విక్రయం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అయితే ఈలోగా గంటల తరబడి వేచి చూసినా టిక్కెట్లు కొనలేక పోవడంతో అభిమానులు బుక్ మై షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గంటల తరబడి వెయిటింగ్ చేసినా టికెట్‌ రాలే..

నిజానికి భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సర్వర్‌ డౌన్‌ అయింది. దీంతో కొందరు అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేయలేకపోయారు. ఆన్‌లైన్‌లో గంటల తరబడి వేచి ఉండి టికెట్‌ కొనుగోలు చేసినా సర్వర్‌ పనిచేయకపోవడంతో టికెట్‌ కొనుగోలు చేయలేకపోయారు. అందుకే, బుక్ మై షోపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తమ సంస్థపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

వెబ్‌సైట్ క్షణాల్లో క్రాష్..


భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌కు టిక్కెట్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని భావించారు. అలాగే, టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమైన తర్వాత వెబ్‌సైట్ క్రాష్ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో అందరూ ముందుగానే టిక్కెట్లు కొనుక్కోవడానికి వేచి ఉన్నారు. అయితే టికెట్ విక్రయాలు ప్రారంభమైన కొద్ది క్షణాలకే వెబ్‌సైట్ క్రాష్ అయింది. టిక్కెట్లు కొనలేక అభిమానులు విసిగిపోయారు. అయితే నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ టిక్కెట్లు అయిపోయాయి. ఇది గమనించిన అభిమానులు బుక్ మై షోపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అలాగే సోషల్ మీడియాలో దీనిపై ప్రశ్నలను లేవనెత్తిన నెటిజన్లు దీన్ని పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. మరికొందరు ఇంత త్వరగా ఎలా అమ్ముడయ్యాయి? టికెట్ ఎవరికి వచ్చింది? ఆ అదృష్టవంతుడు ఎవరని రకరకాల పోస్టుల ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..