IND vs PAK: భారత్-పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌పై కీలక అప్‌డేట్.. ముక్కోణపు వన్డే సిరీస్‌ కూడా.. ఎక్కడంటే?

|

Oct 31, 2022 | 4:10 PM

భారత్, పాకిస్థాన్‌లు ప్రస్తుతం ఐసీసీ లేదా మల్టీనేషన్ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. చాలా కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు.

IND vs PAK: భారత్-పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌పై కీలక అప్‌డేట్.. ముక్కోణపు వన్డే సిరీస్‌ కూడా.. ఎక్కడంటే?
Ind Vs Pak Test Series
Follow us on

టీ20 ప్రపంచకప్ 2022 ఆడేందుకు భారత్-పాకిస్థాన్ జట్లు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అయితే, అతి త్వరలో ఆస్ట్రేలియా కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కు సాక్ష్యమివ్వనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ సైమన్ ఓ’డొనెల్ కీలక సూచన చేశాడు. ఎంసీజీలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య పోరు తర్వాత రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌ నిర్వహణపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు ఆసియా చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌లు ఆడటం చూడవచ్చంటూ తెలిపాడు.

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌లు ఐసీసీ లేదా మల్టీనేషన్ టోర్నమెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. చాలా కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా చొరవతో ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియా ఆతిథ్యంలో భారత్-పాకిస్థాన్ ఢీ!

సెన్ రేడియోతో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ గురించి మాత్రమే కాకుండా ముక్కోణపు వన్డే సిరీస్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. ఆ వన్డే సిరీస్‌లో భారత్, పాకిస్థాన్ జట్లతో పాటు మూడో జట్టుగా ఆస్ట్రేలియా ఆడవచ్చని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

2007లో భారత్-పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు సిరీస్..

మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ ఉత్కంఠతతో ఈ టెస్ట్ సిరీస్, ముక్కోణపు సిరీస్ ప్రతిపాదనలకు ఆజ్యం పోసిందని సైమన్ ఓ’డొనెల్ చెప్పుకొచ్చాడు. భారత్ చివరిసారిగా 2007లో పాకిస్థాన్‌తో తన సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడింది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది.

టీ20 ప్రపంచకప్ విషయానికొస్తే.. పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్ సెమీ ఫైనల్ రేసులో ముందుంది. 3 మ్యాచ్‌ల తర్వాత టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. సెమీ-ఫైనల్‌కు వెళ్లాలంటే, భారత్ ఇప్పుడు సూపర్ 12లో మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవాల్స ఉంది. పాకిస్తాన్ తన విజయంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.