India vs Pakistan: నేడు క్రికెట్ అభిమానులకు పండగరోజు.. భారత్-పాకిస్తాన్ మధ్య పోరు.. ఆందోళన కలిగిస్తున్న టాప్ ఆర్డర్
పవర్‌ప్లేలో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన ఒక సమస్య అయితే, అనుభవం లేని అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్న తీరు జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
India vs Pakistan: ఆసియా కప్‌లో గ్రూప్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఆదివారం నుంచి సూపర్ 4 ప్రయాణాన్ని కొనసాగించనుంది. తన తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో నేడు తలపడనుంది. వారం రోజుల క్రితం టోర్నీ దుబాయ్‌లోని క్రీడా మైదానంలో ఇరు జట్లు ముఖాముఖి తలపడగా.. భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి గెలుపే లక్ష్యంగా టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది. ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. ఈరోజు కూడా ఇరుజట్లు నున్నా నేనా అన్నట్లు తలపడనున్నాయని అంచనావేస్తున్నారు. అయితే గెలవాలంటే జట్టులోని టాప్ ఆర్డర్ చక్కటి ఆటతీరు కనబరచాల్సి ఉంటుంది.
భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్: పవర్‌ప్లేలో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన ఒక సమస్య అయితే, అనుభవం లేని అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్న తీరు జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో హాంకాంగ్‌ను 150 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడించిన పాకిస్థాన్‌తో భారత్ తలపడనుండడంతో భారత్ బౌలింగ్ అటాక్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా టోర్నీకి దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ కూడా అస్వస్థతకు గురయ్యాడు.
రక్షణాత్మకంగా ఆడుతున్న టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయితే పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ల రక్షణాత్మక వైఖరి భారత జట్టుకు సమస్యగా మారింది. పాకిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కానీ, రోహిత్ శర్మ తమ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. పిచ్ నెమ్మదించడంతో బ్యాటింగ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హాంకాంగ్ వంటి బలహీన జట్టుపై కూడా భారత టాప్ ఆర్డర్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం.. ప్రస్తుతానికి ఆందోళన కలిగిస్తోంది. అయితే సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది. KL రాహుల్ 39 బంతుల్లో 36 పరుగులు చేశాడు.. ఇదీ ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్ ఆటతీరు. రాహుల్ ఇప్పటి వరకూ ఇంత నెమ్మదిగా ఎప్పుడూ ఆడలేదు. అంతేకాదు మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లోరాహుల్.. నసీమ్ షా బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే రాహుల్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో రాహుల్ నుంచి మంచి స్కోర్ ను ఆశిస్తున్నారు.
పాకిస్థాన్‌కు మంచి ప్రారంభం కావాలి పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ కూడా తొలి 10 ఓవర్లలో మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది. మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ ఛేజింగ్‌లో మంచి స్కోర్ చేస్తూ విజయాన్ని అందిస్తున్నారు. కానీ మొదట బ్యాటింగ్ విషయానికి వస్తే, ఈ జోడి పెద్దగా రాణించడం లేదు. అంతే కాకుండా దుబాయ్ పిచ్ లపై నిదానంగా ఆడటం వల్ల బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు ఎదురవుతాయి. అభిరుచి లేని పక్షంలో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, అదనపు స్పిన్నర్‌తో భారత జట్టు మైదానంలోకి దిగవచ్చు.
భారత్‌కు అక్షర్ పటేల్ రూపంలో మంచి బౌలర్ అందుబాటులో ఉన్నాడు. దీపక్ హుడాను లేదా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ఆల్-రౌండర్‌గా ప్రయత్నించవచ్చు. పాకిస్థాన్ టాప్ ఆర్డర్‌లో ఉన్న ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లలో ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా వీరిద్దరూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లు. దీంతో భారత్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, హార్దిక్‌లతో పాటు ఆఫ్ స్పిన్నర్ ఉండటం మంచి కలయిక అవుతుంది.
జట్లు అంచనా భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..