IND vs NZ Final: గంభీర్, సూర్య సంచలన నిర్ణయం.. ఫైనల్‌ నుంచి నలుగురు ఔట్..?

India vs New Zealand Final: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ 2026 కోసం సిద్ధమవుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఈ రెండు జట్లు ఫైనల్ పోరులో ఢీ కొట్టబోతున్నాయి. అయితే, టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లను తప్పించినట్లు తెలుస్తోంది.

IND vs NZ Final: గంభీర్, సూర్య సంచలన నిర్ణయం.. ఫైనల్‌ నుంచి నలుగురు ఔట్..?
Teamindia

Updated on: Mar 08, 2026 | 5:28 PM

India vs New Zealand Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ వర్సెస్ న్యూజీలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ భారీ పోరుకు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ నెంబర్-1 బ్యాటర్‌గా గుర్తింపు పొందిన అభిషేక్ శర్మ, అలాగే నెంబర్-1 బౌలర్‌గా పేరుగాంచిన వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారా లేదా అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

రిపోర్టుల ప్రకారం ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లోనే ఉంటారని తెలుస్తోంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో వీరి ప్రదర్శన ఆశించినంతగా లేదని చెప్పాలి. అభిషేక్ శర్మ మొత్తం టోర్నమెంట్‌లో ఒకే ఒక్క అర్ధశతకం మాత్రమే సాధించగా, వరుణ్ చక్రవర్తి కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నాడు.

ప్లేయింగ్ ఎలెవన్ నుంచి బయటకు వెళ్లే నాలుగు ఆటగాళ్లు..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. అంటే కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోవచ్చు. ఫైనల్ వరకు జట్టును తీసుకొచ్చిన అదే 11 మంది ఆటగాళ్లపై టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వాసం ఉంచినట్టు తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజీలాండ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఉండొచ్చు..

అహ్మదాబాద్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని న్యూజీలాండ్ జట్టు కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా జిమ్మీ నిషమ్ లేదా జేకబ్ డఫీ లో ఎవరో ఒకరు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావచ్చు.

న్యూజీలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారెల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, కోల్ మెక్‌కోంకీ, జిమ్మీ నిషమ్ / జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, లోకి ఫర్గుసన్.

భారత్ -న్యూజీలాండ్ మధ్య ఉత్కంఠభరిత పోరు..

గత ఆరు సంవత్సరాల్లో భారత్ వర్సెస్ న్యూజీలాండ్ ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు తలపడ్డాయి. అందులో రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా, మరో రెండు మ్యాచ్‌లు న్యూజీలాండ్ గెలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజీలాండ్ విజయం సాధించింది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ న్యూజీలాండ్‌ను ఓడించింది. గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కూడా భారత్ విజయం సాధించింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us