Controversy Video: టీ20 ప్రపంచకప్‌లో మరో వివాదం.. అంపైర్ ఘోర తప్పిదంతో బలైన టీమిండియా..

|

Oct 05, 2024 | 11:25 AM

T20 World Cup Controversy: మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరుసటి రోజు పెద్ద దుమారం చెలరేగింది. ఇందులో టీమిండియా బలిపశువుగా మారింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో నాలుగో మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బౌలింగ్ చేసింది. ప్రపంచకప్ వంటి ఈవెంట్లలో ఇంతకుముందు ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంది.

Controversy Video: టీ20 ప్రపంచకప్‌లో మరో వివాదం.. అంపైర్ ఘోర తప్పిదంతో బలైన టీమిండియా..
Ind Vs Nz T20i Controversy
Follow us on

T20 World Cup Controversy: మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరుసటి రోజు పెద్ద దుమారం చెలరేగింది. ఇందులో టీమిండియా బలిపశువుగా మారింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో నాలుగో మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బౌలింగ్ చేసింది. ప్రపంచకప్ వంటి ఈవెంట్లలో ఇంతకుముందు ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే, భారత జట్టు బౌలింగ్ సమయంలో ఈ వివాదం చెలరేగడం గమనార్హం. అంపైర్ తప్పిదం వల్ల టీమిండియా చేతికి చిక్కిన వికెట్‌ను చేజార్చుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చాలాసేపు వాదిస్తూనే ఉంది. అయితే, భారత కోచ్ కూడా డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఫోర్త్ అంపైర్‌ను ప్రశ్నించాడు.

రన్ అవుట్‌పై గందరగోళం..

అక్టోబర్ 4 శుక్రవారం దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ వివాదమంతా చోటుచేసుకుంది. న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్నర్ దీప్తి శర్మ తన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బౌలింగ్ చేస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎమిలీ కర్ తన ఓవర్ చివరి బంతిని లాంగ్ ఆఫ్ వైపు ఆడింది. త్వరగా ఒక పరుగు పూర్తి చేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్నప్పటికీ ఆమె వెంటనే బంతిని అందించలేకపోయింది. ఇది చూసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ రెండో పరుగు కోసం పరుగెత్తారు. అయితే, హర్మన్‌ప్రీత్ బౌలింగ్‌లో నేరుగా వికెట్ కీపర్‌కు బంతిని అందించింది. దీంతో కీపర్ అమేలీని రనౌట్ చేసింది.

ఇక్కడే మొత్తం వివాదం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో, ఫోర్త్ అంపైర్ ఆమెను బౌండరీ దగ్గర ఆపి వెనక్కి వెళ్లమని సూచించాడు. ఇది చూసి షాక్ తిన్న భారత ఆటగాళ్లు అంపైర్‌ను ప్రశ్నించారు. వాస్తవానికి విషయం ఏమిటంటే, ఇద్దరు ఆటగాళ్లు ఒక పరుగు తీసుకున్న సమయంలో అంపైర్ క్యాప్‌ను బౌలర్ దీప్తి శర్మకు తిరిగి ఇచ్చింది. దాంతో ఓవర్ ముగిసినట్లుగా ప్రకటించారు. దీని ఆధారంగా అంపైర్ రన్ అవుట్‌ను డెడ్ బాల్‌గా ప్రకటించి తిరస్కరించాడు.

అసహనం వ్యక్తం చేసిన కోచ్, కెప్టెన్..

ఆ తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంపైర్లను ప్రశ్నించడం ప్రారంభించింది. భారత ఆటగాళ్లు కూడా అంపైర్లను చుట్టుముట్టారు. అదే సమయంలో జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ కూడా డ్రెస్సింగ్ రూమ్ నుంచి దిగి బౌండరీ దగ్గరకు వచ్చి ఫోర్త్ అంపైర్‌ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. బ్యాటర్ పరుగు తీస్తుంటే, ఓవర్ ముగిసినట్లు ఎలా ప్రకటిస్తారు? అంటూ చాలా సేపు ఫోర్త్ అంపైర్‌తో వాదించారు. న్-ఫీల్డ్ అంపైర్ల ప్రతిస్పందనతో అసంతృప్తి చెందారు. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ కూడా బౌండరీ దగ్గరకు వెళ్లి ఫోర్త్ అంపైర్‌ను ప్రశ్నించడం ప్రారంభించారు.

రీప్లే చూస్తే, అంపైర్ హడావిడిగా ఓవర్‌ ముగిసిందని ప్రకటించాడని, ఆపై న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రెండవ పరుగు కోసం పరిగెత్తినప్పుడు ఆపలేదని స్పష్టంగా కనిపించింది. అయితే, ఈ నిర్ణయానికి టీమిండియా అంగీకరించక తప్పలేదు. ఆ తర్వాతి ఓవర్ రెండవ బంతికి అమేలీ క్యాచ్ అవుట్ అయింది. భారత జట్టు దాని ప్రతిఫలాన్ని అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..