AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs HK Playing 11: టాస్ గెలిచిన హాంకాంగ్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పుతో బరిలోకి భారత్..

2008లో భారత్, హాంకాంగ్ జట్లు తొలిసారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.

IND Vs HK Playing 11: టాస్ గెలిచిన హాంకాంగ్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పుతో బరిలోకి భారత్..
Ind Vs Hk Playing 11
Venkata Chari
|

Updated on: Aug 31, 2022 | 7:13 PM

Share

IND Vs HK Playing 11: 10 నెలల క్రితం పాక్‌తో జరిగిన ఓటమి ఖాతాలో వేసుకున్న భారత జట్టు.. ఆసియా కప్ తొలి పోరులో ఆ జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేడు రెండో మ్యాచ్ లో హాంకాంగ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. క్వాలిఫయర్స్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హాంకాంగ్ ఆసియా కప్‌లో ప్రధాన రౌండ్‌లోకి ప్రవేశించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. దీంతో టాస్ గెలిచిన టాస్ గెలిచిన హాంకాగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైంది.

హార్దిక్ స్థానంలో పంత్‌కి అవకాశం లభించింది. రానున్న మ్యాచ్ ల కోసం హార్దిక్ కు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ౠడనున్నాడు. T20 ఇంటర్నేషనల్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి.

ఆసియా కప్ చరిత్రలో మూడోసారి..

2008లో భారత్, హాంకాంగ్ జట్లు తొలిసారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా ఇద్దరూ అద్భుత సెంచరీలు చేశారు. ధోనీ 109 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రైనా 101 పరుగులు చేశాడు. తర్వాత హాంకాంగ్ జట్టు మొత్తం 118 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 256 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

దీని తర్వాత 2018లో జరిగిన ఆసియా కప్‌లో గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ 50 ఓవర్ల మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 127 పరుగులతో భారత్ 285 పరుగులు చేసింది. పరుగుల వేటలో హాంకాంగ్ జట్టు కూడా పటిష్ట ప్రదర్శన చేసి 8 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. దీంతో భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.

క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు..

భారత జట్టు గురించి మాట్లాడుకుంటే.. పాకిస్థాన్‌ను ఓడించి సూపర్ 4లో తమ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్న హాంకాంగ్ జట్టు తొలిసారి టోర్నీలోకి అడుగుపెట్టనుంది. ఇప్పుడు క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్‌కు ఇది తొలి ప్రయాణం.

ముందుగా సింగపూర్‌ను 8 పరుగుల తేడాతో ఓడించి హాంకాంగ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తర్వాతి మ్యాచ్‌లో కువైట్‌పై ఏకపక్ష విజయం సాధించింది. ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది.

ఇరుజట్ల ప్లేయింగ్ XI

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్(కీపర్), భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్

హాంకాంగ్ (ప్లేయింగ్ XI): నిజాకత్ ఖాన్(కెప్టెన్), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, స్కాట్ మెక్ కెచ్నీ(కీపర్), జీషన్ అలీ, హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ ఘజన్‌ఫర్