IND vs ENG 1st T20: అందరూ పడుకున్నాక అదరగొట్టిన టీమిండియా! అభి‘షేక్‌ ఆడించాడు’.. కానీ

భారత్-ఇంగ్లాండ్ తొలి T20 వర్షం కారణంగా రద్దైంది. ఇండియా 189/7 భారీ స్కోర్ చేసినా, ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు రాలేకపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో కెప్టెన్సీలో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేయగా, అభిషేక్ శర్మ 59 పరుగులు, శివమ్ దూబే 42 పరుగులు చేసి అదరగొట్టారు. సంజూ శాంసన్ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. అయ్యర్ ఫామ్ లోకి రావడం భారత జట్టుకు శుభసూచకం.

IND vs ENG 1st T20: అందరూ పడుకున్నాక అదరగొట్టిన టీమిండియా! అభి‘షేక్‌ ఆడించాడు’.. కానీ
Abhishek And Shreyas

Updated on: Jul 02, 2026 | 6:00 AM

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్‌ మొదలైపోయింది. తొలి మ్యాచ్‌ బుధవారం రాత్రి 10 గంటలకు మొదలైంది. చెస్టర్-లె-స్ట్రీట్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్‌ జరిగేది ఇంగ్లాండ్‌లో కానుక మన కాలమాన ప్రకారం మ్యాచ్‌ మధ్యరాత్రి జరగడంతో చాలా మంది భారత క్రికెట్‌ అభిమానులు చూడలేకపోయారు. కొంతమంది టీమిండియా బ్యాటింగ్‌ చూసినా ఎక్కువ మంది నిద్రలోకి జారుకున్నారు.

అయితే అందరూ పడుకున్నాక టీమిండియా అదరగొట్టిందనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్‌ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మరోసారి ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇక టీ20ల్లో వరల్డ్‌ నంబర్‌ స్థానానికి చేరుకున్న ఇషాన్‌ కిషన్‌ సైతం విఫలం అయ్యాడు. కానీ, ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మాత్రం షేకాడించాడు. కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులుచేసి అదరగొట్టాడు. అతనికి సర్పంచ్‌సాబ్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సైతం జతకలిశాడు.

ఇది కూడా చదవండి: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

టీ20 కెప్టెన్సీ దక్కాక పెద్దగా రాణించని అయ్యర్‌.. ఆ కసిమొత్తం ఈ మ్యాచ్‌లో చూపించాడు. 47 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 68 పరుగులు చేసి టీ20 కెప్టెన్‌గా తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అయ్యర్‌ ఇన్సింగ్స్‌ కాస్త స్లో అనిపించినా.. టీమిండియా కేవలం 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడటంతో అయ్యర్‌ అలా ఆడాల్సి వచ్చింది. ఇక చివర్లో శివమ్‌ దూబే శివాలెత్తాడు. కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి మంచి ఎండింగ్‌ అందించాడు.

ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్.. ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మొత్తంగా టీమిండియా మంచి టార్గెట్‌ సెట్‌ చేసింది కానీ, వరుణ దేవుడు అడ్డుపడటంతో మ్యాచ్‌ కాస్త వర్షార్పణం అయింది. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌తో అయ్యర్‌ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే సంజూ ఫామ్‌ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అతని ప్లేస్‌లో ఇప్పటికైనా వైభవ్‌ సూర్యవంశీని తీసుకోవాలనే అభిమానుల డిమాండ్‌ ఇంకాస్త ఎక్కువైంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us