India vs England: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. మొదట బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఈ ఆటగాడు ఆ తర్వాత బంతితోనూ చెలరేగాడు. దీంతో ఆతిథ్య జట్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇక రెండో రోజు ఆటలో హైలెట్ అంటే బుమ్రా బూమ్ బూమ్ ఇన్నింగ్స్. ఎక్కువగా బంతులతోనే బ్యాటర్ల భరతం పట్టే ఈ ఫాస్ట్ బౌలర్ రెండో రోజు ఆటలో తన బ్యాట్ పవర్‌ను కూడా ప్రత్యర్థులకు రుచి చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్‌లో బుమ్రా (4, 5 వైడ్లు, 6 నోబాల్, 4, 4, 4, 6, 1) దంచికొట్టడంతో మొత్తం 35 పరుగులు వచ్చాయి. దీంతో టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు బ్రియాన్ లారా, బెయిలీ, కేశవ్ మహారాజ్.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశారు. కాగా బుమ్రా బూమ్‌బూమ్ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) బుమ్రా మెరుపు ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. ఈ మేరకు బీసీసీఐ పంచుకున్న వీడియోలో శాస్త్రి మాట్లాడుతూ ఇది ఎవరూ ఊహించి ఉండరని అభిప్రాయపడ్డాడు.
3⃣5⃣ runs in one over ?
ఇవి కూడా చదవండి2⃣9⃣ off Bumrah’s bat ?
Here’s Former Head Coach @RaviShastriOfc‘s take on the @Jaspritbumrah93 blitz ⚡⚡#TeamIndia | #ENGvIND pic.twitter.com/fG2wwNstRQ
— BCCI (@BCCI) July 2, 2022
క్రికెట్‌లో మీరింకా విద్యార్థే..
‘ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు వచ్చినప్పుడు నేను మైక్ వద్ద ఉన్నానని చెప్పకండి. నేను ప్రతి బంతిని క్షుణ్ణంగా చూశాను. కానీ ఇది ఇంకా నిజమని నమ్మలేకపోతున్నా. యువరాజ్ సింగ్ 6బంతుల్లో 6సిక్సులు కొట్టి 36పరుగులు చేసినప్పుడు కూడా నేను కామెంట్రీ బాక్స్‌లోనే ఉన్నాను. కానీ అది వేరు. ఈ రోజు నేను చూసినది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇది మీరు కూడా ఊహించలేరు. ఒక స్పెషలిస్టు బ్యాటర్ వల్ల కాని బుమ్రా ప్రపంచ రికార్డు సృష్టించాడు. పదోస్థానంలో వచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యువీ 36 పరుగులు చేయడం, నేను కూడా 36 పరుగులు చేయడం పక్కన పెడితే.. ఈ రోజు నేను చూసింది అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం. క్రికెట్‌లో ఈ పాటికే మీరు అన్నీ చూశామని అనుకోవచ్చు. కానీ, మీరింకా విద్యార్థి అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చూడాల్సింది చాలా ఉందని గ్రహించాలి. ఏదో ఒక రోజు ఇంతకన్నా మెరుగైన రికార్డు మీరు చూస్తారు. ఈరోజు నేను చూసింది కూడా అలాంటిదే’ అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
Just when you think you have seen it all, this game surprises you even more. Fascinating batting from @Jaspritbumrah93 to smash the red cherry for 29 in an over. First in Durban with @YUVSTRONG12 & now in Birmingham. On air right place right time for 35 and 36.
— Ravi Shastri (@RaviShastriOfc) July 2, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..