World Cup 2023: వరుణుడి ఖాతాలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్.. ఒక్క బాల్ కూడా పడకుండానే ఆట రద్దు..
IND vs ENG, World Cup 2023: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వరల్డ్ కప్ 2023 నాలుగో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ వేసే వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఒక బంతి కూడా పడకుండా వరుణుడు అడ్డుపడింది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రి 5:40 గంటల వరకు నిరీక్షించి చూసినా వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లుగా..

IND vs ENG, World Cup 2023: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వరల్డ్ కప్ 2023 నాలుగో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ వేసే వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఒక బంతి కూడా పడకుండా వరుణుడు అడ్డుపడింది. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రి 5:40 గంటల వరకు నిరీక్షించి చూసినా వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. ఇక అంతకముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వర్షం అడ్డు రావడంతో ఒక్క బంతి ఆట కూడా ఆడకుండానే ఆట రద్దయింది.
#INDvENG: Match called off. pic.twitter.com/sGWqYV45L3
— CricTracker (@Cricketracker) September 30, 2023
ఇదిలా ఉండగా.. తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన ఐదో వార్మప్ మ్యాచ్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ కూడా వేసే వీలు లేకుండా తిరువనంతపురంలో వర్షం పడడంతో ఆటను ప్రారంభించలేకపోయారు. ప్రస్తుతం వర్షం తగ్గిన నేపథ్యంలో 6:45 గంటలకు టాస్ వేసి.. 7 గంటలకు ఆటను ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు.
#INDvENG Match called off after all the wait, we will not see any action today.
Next warm-up fixture for India is on Tuesday, against Netherlands, in Thiruvananthapuram.
Last 2 matches in Thiruvananthapuram are also washed out.#ICCWorldCup2023 #ICCWorldCup #CricketWorldCup… pic.twitter.com/Nglvzh9QCS
— Abhishek Singhal (@abhitweets20) September 30, 2023
వరల్డ్ కప్ కోసం భారత్-ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా–నెదర్లాండ్స్ జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓడౌడ్, బాస్ డి లైడ్, విక్రమ్ సింగ్, తేజా నిడమనూర్, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సాకిబ్ జుల్ఫిక్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




