World Cup 2023: అడ్డు తొలగిన వరుణుడు.. నెదర్లాండ్స్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తుది జట్ల వివరాలివే..
AUS vs NED, World Cup 2023: తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు తొలిగాడు. దీంతో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 1:30 గంటలకే జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా 7 గంటలకు ప్రారంభమైంది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన కంగారుల జట్టు రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ను..

AUS vs NED, World Cup 2023: తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు తొలిగాడు. దీంతో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 1:30 గంటలకే జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా 7 గంటలకు ప్రారంభమైంది.
అయితే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన కంగారుల జట్టు రెండో ఓవర్లోనే జోస్ ఇంగ్లిస్(0) వికెట్‌ను కోల్పోయింది. 3 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆసీస్ ఓ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్(3), అలెక్స్ కారీ(9) ఉన్నారు.
Steve Smith is opening the batting for Australia alongside Josh Inglis in the practice match against Netherlands.
📸: Disney + Hotstar pic.twitter.com/jhsqJLgvWr
— CricTracker (@Cricketracker) September 30, 2023
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా–నెదర్లాండ్స్ జట్లు:
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓడౌడ్, బాస్ డి లైడ్, విక్రమ్ సింగ్, తేజా నిడమనూర్, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సాకిబ్ జుల్ఫిక్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.
ఇదిలా ఉండగా.. భారత్, ఇంగ్లాండ్ మధ్య గువహతి వేదికగా జరగాల్సిన నాల్గో వార్మప్ మ్యాచ్ టాస్ పడిన తర్వాత వర్షం కారణంగా రద్దయింది. మధ్యహ్నం టాస్ వేసిన తర్వాత వర్షం అడ్డుపడింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో సాయంత్రం 5:40 గంటలకు మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. అంతకముందు టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
#INDvENG: Match called off. pic.twitter.com/sGWqYV45L3
— CricTracker (@Cricketracker) September 30, 2023
వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ కోసం భారత్-ఇంగ్లాండ్ జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




