IND vs ENG 3rd ODI Toss: మూడోసారి టాస్ ఓడిన రోహిత్.. ప్లేయింగ్ 11లో మార్పులు.. ఎవరొచ్చారంటే?
IND vs ENG 3rd ODI Playing 11: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది. రెండు వన్డేలలో ఇంగ్లాండ్ జట్టును ఓడించిన రోహిత్ సేన.. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. నేటి మ్యాచ్‌లోనైనా గెలిచి, పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

IND vs ENG 3rd ODI Playing 11: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది. జడేజా, షమీకి విశ్రాంతి ఇవ్వగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చారు.
రెండు వన్డేలలో ఇంగ్లాండ్ జట్టును ఓడించిన రోహిత్ సేన.. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. నేటి మ్యాచ్‌లోనైనా గెలిచి, పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సరైన జట్టు కలయిక కోసం చూస్తున్నాడు. భారత జట్టు తన చివరి మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడింది. ఈ మ్యాచ్‌లో కంగారు జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఇంగ్లాండ్, భారత జట్లు మొదటిసారి వన్డేలో తలపడుతున్నాయి.
England have won the toss and elect to bowl first in the 3rd and final ODI of the series.
Live – https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/TrVAf1FUAT
— BCCI (@BCCI) February 12, 2025
IND vs ENG 3rd ODI – ప్లేయింగ్ XI..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్(కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




