IND vs ENG 2nd Test Day 1 Highlights : ముగిసిన తొలిరోజు.. టీమిండియా స్కోర్ 276/3, శతకంతో రాణించిన రాహుల్- అర్థ శతకంతో రోహిత్ ఆకట్టుకున్నారు.
IND vs ENG 2nd Test Day 1 Highlights : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి రోజు3 వికెట్లు కోల్పోయి 276 పరుగులు సాధించింది.

IND vs ENG 2nd Test Day 1 Highlights : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి రోజు3 వికెట్లు కోల్పోయి 276 పరుగులు సాధించింది. తొలి సెషన్‌లో 46/0తో నిలిచిన కోహ్లీసేన రెండో సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి మరో 130 పరుగులు చేసింది. మొత్తం90 ఓవర్లకు 273 పరుగులు సాధించి పటిష్టస్థితిలో నిలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ(83; 145 బంతుల్లో 11×4, 1×6) ఆకట్టుకున్నాడు. తొలిసారి లార్డ్స్ మైదానంలో ఆడుతున్న రోహిత్ మొదట్లో ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించాడు. ఈక్రమంలోనే తన 13వ అర్థ శతకం సాధించాడు. ఆతర్వాత అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (127 నాటౌట్; 248 బంతుల్లో 14×4, 1×6) దూసుకెళ్తున్నాడు
మరోవైపు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా(9; 23 బంతుల్లో 1×4) మరోసారి నిరాశపరిచాడు. ఆ సమయంలో భారత్ 150 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అయితే కోహ్లీ మాత్రం పరుగులు సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. చివరకు 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం అజింకే రహానే(1) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. రాబిన్ సన్ 1 వికెట్. మిగతా బౌలర్లు ఆకట్టుకోలేకపోయారు.
ఇంగ్లండ్, టీమిండియా టీంల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. నేడు లార్డ్స్ స్టేడియంలో రెండొవ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న గట్టి పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగింది. తొలిటెస్టులో బరిలోకి దిగిన జట్టులో ఒకే ఒక మార్పుతో రెండవ టెస్టులోకి దిగనుంది. ఇద్దరు పేసర్లు గాయాలతో బాధపడుతుండడంతో ఇంగ్లీష్ జట్టుకి కొత్త తలనొప్పిగా తయారైంది. ఇంగ్లండ్‌పై టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. లార్డ్స్ మైదానం మాత్రం భారత్‌ను కలవరపెడుతోంది.
లార్డ్స్ స్టేడియంలో 18 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం 2 రెండు టెస్టుల్లో మాత్రమే గెలిచింది. 12 టెస్టుల్లో ఓడిపోయింది. మిగతా 4 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో 64వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అలాగే లార్డ్స్‌లో ప్రధాన భారత బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించకపోవడం సమస్య కానుంది.
రెండో టెస్టుకు ముందు ఆతిథ్య ఇంగ్లండ్ టీం గాయాలతో ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అండర్సన్ కూడా గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టీమిండియా ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో రెండొవ టెస్టు ఆడడం లేదు. అతడి స్థానంలో అశ్విన్‌కు అవకాశం రానుందని తెలుస్తోంది.
LIVE NEWS & UPDATES
-
రెండో టెస్ట్- మొదటి రోజు ముగిసిన ఆట..
రెండో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు. కెఎల్ రాహుల్ 127 పరుగులు చేయగా, అజింకే రహానే 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు.
-
బ్యాటింగ్‌కు దిగిన అజింకే రహానే
అజింకే రహానే కోహ్లీ స్థానంలోకి వచ్చాడు. రహానే సపోర్ట్‌తో రాహుల్ పరుగులు వేగంగా సాధిస్తున్నాడు. ప్రస్తతం రాహుల్ 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 124 వద్ద కొనసాగుతున్నాడు.
-
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా కోహ్లీ 42పరుగులకు అవుట్ అయ్యాడు. భారత్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 268 సాధించింది. రాహుల్ 120పరుగులతో కొనసాగుతోన్నాడు.
-
భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 260..
భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 260పరుగులు. విరాట్ కోహ్లీ 42, రాహుల్ సెంచరీతో రెచ్చిపోతున్నాడు 113 పరుగులు సాధించాడు.
-
జోరు పెంచిన విరాట్ కోహ్లీ
ఓ వైపు రాహుల్ సెంచరీతో చెలరేగుతుంటే.. మరో వైపు కోహ్లీ అర్ధ సెంచరీకి చేరువవుతున్నాడు.. రాహుల్ -106, కోహ్లీ -40 భారత్ స్కోర్ -252/2
-
-
సెంచరీతో చెలరేగిన రాహుల్..
సెంచరీతో చెలరేగిన రాహుల్. 103 పరుగులు సాధించిన ఓపెనర్ , కోహ్లీ -38 రెండు వికెట్ల నష్టానికి భారత్ స్కోర్-247
-
సెంచరీకి రెండు పరుగులు దూరంలో రాహుల్
సెంచరీకి రెండు పరుగులు దూరంలో రాహుల్, 98 పరుగులతో కొనసాగుతోన్న ఓపెనర్ రాహుల్
-
స్పీడ్ పెంచిన భారత్ 225/2
భారత్ జోరు చూపిస్తోంది. 73 ఓవర్లకు భారత్ స్కోర్ 225 పరుగులు సాధించింది. కోహ్లీ- 28, రాహుల్- 73పరుగులతో కొనసాగుతున్నారు.
-
భారత్ స్కోర్ 223/2
టీమిండియా 71పరుగులకు రెండు వికెట్ల నష్టానికి 221పరుగులు చేసింది. రాహుల్-89 కోహ్లీ-28 పరుగులతో కొనసాగుతున్నారు.
-
ఆచితూచి ఆడుతోన్న విరాట్ కోహ్లీ..
సెటిల్‌గా ఆడుతోన్న కోహ్లీ.. సెంచరీకి దగ్గరలో రాహుల్- 88. కోహ్లీ- 23
-
200 దాటిన భారత్ స్కోర్
మార్క్‌వుడ్ వేసిన 64వ ఓవర్ లో 5 పరుగులు సాధించడంతో భారత్ 200 పరుగులు సాధించింది. రాహుల్-84 కోహ్లీ 14 పరుగులు చేశారు.
-
దూకుడు పెంచిన రాహుల్.. భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 187
దూకుడు పెంచిన రాహుల్..సామ్‌కరన్ వేసిన 59ఓవర్‌లో రాహుల్-కోహ్లీ కలిసి 8పరుగులు సాధించారు. దాంతో భారత్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
-
రాహుల్ అర్ధ శతకం
కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తొలి టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. ఇక టీమ్‌ఇండియా 52 ఓవర్లకు 157/2తో నిలిచింది. రోహిత్ శర్మ(83), పుజారా(9) వికెట్లు కోల్పోయింది.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా (9) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 150/2 పరుగులు సాధించింది.
-
హాప్ సెంచరీ దిశగా కేఎల్ రాహుల్
రెండో టెస్టులో తొలి ఇన్నింగ్‌లో 47 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి టీమిండియా 142 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీకి (47) చేరువయ్యాడు. ప్రస్తుతం రాహుల్‌తో పాటు పుజరా (2) క్రీజులో ఉన్నాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
126 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సెంచరీ వైపు దూసుకెళ్తున్న రోహిత్ (83) అండర్‌సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. లార్డ్స్‌లో తొలిసారి ఆడుతున్న రోహిత్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
-
100 పరుగులకు చేరుకున్న టీమిండియా..
లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓపెనర్లు వికెట్ పడకుండా ఆడుతున్నారు. దీంతో టీమిండియా 100 పరుగులకు చేరకుంది. రోహిత్ 75(11ఫోర్లు, సిక్స్), రాహుల్ 16 పరుగులతో క్రీజులు ఉన్నారు.
-
అర్థ సెంచరీ పూర్తి చేసిన రోహిత్..
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓవైపు నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొడుతున్నాడు. 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 13 వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 71/0 పరుగుల వద్ద ఉంది. రోహిత్ 50, కేఎల్ రాహాల్ 15 పరుగులతో ఆడుతున్నారు.
-
రోహిత్, రాహుల్ జోడీ సరికొత్త రికార్డు..
లార్డ్స్ మైదానంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(35), కేఎల్ రాహుల్ (10) సరికొత్త రికార్డు నెలకొల్పారు. తొలి సెషన్‌లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో 2008లో ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్ట్రాస్, అలిస్టర్ కుక్ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించిన తర్వాత టీమిండియా జోడీ సాధించిన ఈ 46 పరుగులే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలవడం విశేషం.
-
లంచ్ తరువాత మొదలైన ఆట
చిరుజల్లులు పడడంతో ఆట ఆగడంతో ముందుగానే అంపైర్లు లంచ్ టైం ప్రకటించారు. లంచ్ తరువాత ఆట మరలా మొదలైంది. వికెట్లు పడకుండా ఓపెనర్లు పరుగులు సాధిస్తున్నారు.
-
మరోసారి ఆగిన ఆట..
వర్షంతో మరోసారి ఆట ఆగింది. చిరుజల్లులు కురుస్తుండడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. ప్రస్తుతం టీమిండియా 46 పరుగులతో ఉంది. రోహిత్ 35, రాహుల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
15వ ఓవర్లో వరుస ఫోర్లతో విరుచపడిన రోహిత్..
సామ్ కరన్ వేసిన 15వ ఓవర్‌లో రోహిత్ విరుచకపడ్డాడు. ఈ ఓవర్లో వరుస ఫోర్లతో బౌలర్‌పై ఆధిపత్యం చూపించాడు. ఈ ఓవర్లో రోహిత్ 4 ఫోర్లు బాదేశాడు.
-
15 ఓవర్లకు టీమిండియా 38/0
15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 38 పరుగులు చేసింది. రోహిత్ 29(5ఫోర్లు), రాహుల్ 8పరుగులతో క్రీజులో నిలిచారు.
-
5 ఓవర్లకు టీమిండియా 6/0
టీమిండియా ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. కేవలం సింగిల్స్ తీస్తూ పిచ్‌ను అర్థం చేసుకునే పనిలో పడ్డారు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 పరుగులు చేసింది. రోహిత్ 5, రాహుల్ 1పరుగులతో క్రీజులో నిలిచారు.
-
మొదలైన మ్యాచ్.. ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్
ఇప్పటికే రెండుసార్లు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు చిరుజల్లులు తగ్గడంతో మ్యాచ్ ప్రారంభమైంది. టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు.
-
మరోసారి అడ్డుపడిన వర్షం.. ప్రారభం కాని మ్యాచ్
టాస్ అనంతరం మరోసారి వర్షం పడింది. దీంతో మ్యాచ్ ఆరంభం కాలేదు.
-
ప్లేయింగ్ ఎలెవన్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (కీపర్), మొయిన్ అలీ, సామ్ కర్రాన్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
Toss & team news from Lord’s!
England have elected to bowl against #TeamIndia in the 2⃣nd #ENGvIND Test. ?
Follow the match ? https://t.co/KGM2YELLde
Here’s India’s Playing XI ? pic.twitter.com/leCpLfUDnG
— BCCI (@BCCI) August 12, 2021
-
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
ఇంగ్లండ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
ఆగిన వర్షం… టాస్ టైం @ 3.20 గంటలకు
చిరు జల్లులు ఆగిపోయాయి. దీంతో మూడు గంటలకు పడాల్సిన టాస్‌ను 3.20గంటలకు వేయనున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ 3.45 గంటలకు ప్రారంభం కానుంది.
? UPDATE from Lord’s!
Toss delayed & will take place at 10.50 local time (15.20 IST).
Play will commence at 11.15 local time (15.45 IST). #TeamIndia #ENGvIND pic.twitter.com/dpzLfTCjeQ
— BCCI (@BCCI) August 12, 2021
-
వర్షంతో టాస్ ఆలస్యం
కొద్ది క్షణాల్లో టాస్ పడనుండగా.. చిరుజల్లులు మొదలయ్యాయి. దీంతో టాస్ వేసేందుకు కొద్దగా ఆలస్యం కానుంది.
Published On - Aug 12,2021 2:53 PM




