India vs England: రేపట్నుంచి ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే! కెప్టెన్ గిల్‌కు ఇది అగ్ని పరీక్షే!
ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తొలి టెస్ట్‌కు సిద్ధమవుతోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలి పరీక్ష ఇది. భారత జట్టులో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్ళు ఉన్నారు. నంబర్ 3 స్థానంపై ఉత్కంఠ నెలకొంది.

ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన టీమిండియా ఒక టఫ్ ఫైట్‌కు సిద్ధం కాబోతుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి లీడ్స్‌లోని హెడింగ్లీలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌తో శుబ్‌మన్ గిల్ తన టెస్ట్ కెప్టెన్సీని మొదలుపెట్టనున్నాడు. కెప్టెన్‌గా తొలి టెస్ట్ గెలవాలనే ఒత్తిడి అతనిపై ఉంది. సో.. ఇది గిల్‌కు ఒక అగ్నిపరీక్ష లాంటిదే. ఇక తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే తమ ప్లేయింగ్ 11ని ప్రకటించగా, టీమిండియా ఇంకా వెల్లడించలేదు. భారత వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ బుధవారం శుబ్‌భ్‌మాన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు.
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఖాళీగా ఉన్న స్థానం ఇది. ఇక ఐదో స్థానంలో పంత్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మరి ఎంతో కీలకమైన నంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. లీడ్స్ వాతావరణం వేడిగా ఉండటంతో స్పిన్‌కు కాస్త అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. దాంతో రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం మెండుగా ఉంది. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి మ్యాచ్ లో కచ్చితంగా ఆడతానని చెప్పాడు. బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లేదా అర్ష్ దీప్ సింగ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారు.
మొత్తంగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్/సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/కుల్దీప్ యాదవ్/నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. కాగా ఇంగ్లాండ్ ఇప్పటికే తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. వారి ప్లేయింగ్ 11 చూసుకుంటే.. బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




