టీమిండియా గట్టెక్కింది. ఢాకా వేదికగా బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 145 పరుగుల లక్ష్య ఛేదనలో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను శ్రేయస్ అయ్యర్ (29), రవిచంద్రన్ అశ్విన్ (42) ఆదుకున్నారు. అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించి భారతజట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో క్వీన్ స్వీప్ చేసింది రాహుల్ సేన. తద్వారా వన్డే సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. అంతేకాదు ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో మరో అడుగు ముందుకేసింది.
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, గిల్, పుజారా, కోహ్లీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, ఉనాద్కత్.. ఇలా వచ్చిన వారు వచ్చినట్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుకున్నారు. దీంతో బంగ్లా చేతిలో మరో భంగపాటు తప్పదని చాలామంది భావించారు. అయితే శ్రేయస్ అయ్యర్, అశ్విన్‌లు నిలకడగా ఆడారు. క్రీజులో నిలదొక్కుకుని నిదానంగా ఆడుతూ టీమిండియా స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. శ్రేయస్ సంయమనంతో ఆడగా, అశ్విన్ మాత్రం వీలైనప్పుడల్లా బౌండరీలతో చెలరేగాడు. వీరిద్దరూ అభేద్యమైన 8 వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించారు. వీరిద్దరి మధ్య 71 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. అశ్విన్ 42, అయ్యర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఆతొలి ఇన్నింగ్స్‌లో భారత్ 227 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగుల సాధించి కీలకమైన ఆధిక్యం సాధించింది. ఇక బంగ్లాదేశ్ తమ రెండవ ఇన్నింగ్స్‌లో 231కు ఆలౌటై టీమిండియాకు 145 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే టాపార్డర్ వైఫల్యంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లకు 45 పరుగులు చేసింది భారత్. ఇక నాలుగో రోజు కూడా త్వరగానే వికెట్లు కోల్పోయింది. అయితే అయ్యర్, అశ్విన్ జోడీ బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరు వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 42 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అశ్విన్. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. అలాగే సిరీస్‌లో రాణించిన ఛతేశ్వర్ పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
A cracking unbeaten 71-run stand between @ShreyasIyer15 (29*) & @ashwinravi99 (42*) power #TeamIndia to win in the second #BANvIND Test and 2⃣-0⃣ series victory ??
Scorecard – https://t.co/CrrjGfXPgL pic.twitter.com/XVyuxBdcIB
— BCCI (@BCCI) December 25, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..